Kajal Aggarwal : సమంత, రకుల్‌కు కాజల్ అగర్వాల్ సంచలన సవాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం రోజుకు మూడు పూటలా ఎంతో ఇష్టంగా తినే ఆహారం అసలు సురక్షితమేనా? పచ్చటి పంటల వెనుక దాగున్న కెమికల్స్ మన శరీరంలోకి ఎలా చేరుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ , బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే సరికొత్త సోషల్ మీడియా మూవ్‌మెంట్‌కు శ్రీకారం చుట్టారు. తాము నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఇండియా స్టోరీ’ (The India Story) ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరూ కలిసి #WhatsOnYourPlate అనే వినూత్న ఛాలెంజ్‌ను ప్రారంభించారు.
సమంత, రకుల్ ప్రీత్‌లకు కాజల్ సవాల్!
ఈ ఛాలెంజ్‌లో భాగంగా కాజల్ అగర్వాల్ తన భోజనం పళ్లెం ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మనం తినే ఆహారంలో పురుగుమందుల కల్తీ ఎంతవరకు ఉందనే కోణంలో ఆలోచన రేకెత్తించే పోస్ట్ పెట్టారు. ఈ చైతన్య ఉద్యమం ఇక్కడితోనే ఆగిపోకుండా ఉండేందుకు ఆమె టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ సమంత రూత్ ప్రభు, రకుల్ ప్రీత్ సింగ్ లని ఈ ఛాలెంజ్‌లోకి ఆహ్వానిస్తూ నామినేట్ చేశారు. మరోవైపు శ్రేయాస్ తల్పాడే కూడా ఈ క్యాంపెయిన్‌లో భాగమవుతూ.. ప్రతి ఒక్కరూ తాము తినే ఆహారంపై మరింత అవగాహన పెంచుకోవాలని, ఈ సవాల్‌ను స్వీకరించి తమ భోజనం ఫోటోలను షేర్ చేయాలని పిలుపునిచ్చారు. థియేటర్లలో కేవలం సినిమా చూపించడమే కాకుండా, ప్రతి ఇంటా ఒక ఆరోగ్యకరమైన చర్చ జరగాలనే ఉద్దేశంతో ఈ ఛాలెంజ్‌ను డిజైన్ చేశారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో విచ్చలవిడిగా వాడుతున్న పురుగుమందులు, రసాయనాల వల్ల సామాన్య ప్రజల ఆరోగ్యం ఎలా ప్రమాదంలో పడుతోందనే సున్నితమైన, అత్యంత భయంకరమైన సామాజిక అంశాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ క్రేజీ సోషియో-రియలిస్టిక్ డ్రామా జూలై 24, 2026న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
తాజావార్తలు
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?