Odisha: భర్తకు దూరంగా ఉంటున్న మహిళ ఉపాధ్యాయురాలు, తోటి ఉపాధ్యాయుడితో వివాహేత సంబంధం పెట్టుకుందని భర్త ఆరోపిస్తూ వారిద్దరిపై దాడి చేసిన ఘటన ఒడిశాలోని పూరి జిల్లాలో వెలుగుచూసింది. ఉపాధ్యాయురాలిపై ఆమె భర్త, పలువురు దాడి చేసి చెప్పుల దండ వేసి వీధుల్లో ఊరేగించారు. ఆమెతో పాటు ఉన్న సహచర ఉపాధ్యాయుడిని అర్ధనగ్నంగా ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
READ ALSO: కొత్త బైక్ లేదా స్కూటర్ కొనాలనేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న Honda వాహనాల ధరలు!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ వివాదాల కారణంగా కళాశాల లెక్చరర్ అయిన భర్త నుంచి ఆ మహిళ ఉపాధ్యాయురాలు వేరుగా పూరీలోని నీమపడ ప్రాంతంలో అద్దెకు నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమె భర్త కొంతమంది కలిసి ఆమె నివసిస్తున్న ప్రాంతానికి వచ్చి.. ఆమె ఎవరితోనే వివాహేతర సంబంధం పెట్టుకుందని బలవంతంగా ఆమె ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేశాడు. ఇదే సమయంలో లోపల ఆమెతో పాటు తన సహచర ఉపాధ్యాయుడు ఉన్నట్లు గుర్తించిన భర్త వారిని బయటకు లాగి, జనాలు చూస్తుండగా వీధుల్లో నడిపించాడు. ఆమె తోటి ఉపాధ్యాయుడిని అర్ధనగ్నంగా ఊరేగించిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి.
ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు పోలీసులు వెంటనే జోక్యం చేసుకున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు భర్త మరికొంత మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
READ ALSO: Facebook Love Story: ఫేస్బుక్ ప్రేమాయణం.. బోర్డర్స్ దాటిన లవ్ స్టోరీ..