Hyderabad: ఒరిస్సా గంజాయి లేడీ డాన్ అరెస్టు.. వెలుగులోకి సంచలన విషయాలు
- ఒరిస్సా గంజాయి లేడీ డాన్ సంగీతా సాహు అరెస్టు
- గంజాయి వినియోగం ఎక్కడ ఉంటే అక్కడి వెళ్లి గంజాయి వ్యాపారులతో ఒప్పందాలు
- గత నాలుగు సంవత్సరాల నుంచి హోల్‌సేల్ గంజాయి వ్యాపారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గంజాయి.. సమాజాన్ని పట్టిపీడిస్తున్న భూతం. గంజాయి నిర్మూళనకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. ముఖ్యంగా యువత గంజాయికి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం గంజాయి రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల ధూల్ పేట గంజాయి డాన్ అంగూర్ బాయి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఒరిస్సా గంజాయి లేడీ డాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో ఐదు కేసుల్లో నిందితురాలిగా ఉన్న సంగీతా సాహును అరెస్టు చేయడానికి ప్రత్యేక టీమ్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసస్ రెడ్డి ఒరిస్సాకు పంపించారు.
Also Read:Saptagiri: సప్తగిరి అత్యుత్సాహం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
Also Read
- Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్‌తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
నంద్యాల అంజి రెడ్డి పర్యవేక్షణలో తెలంగాణ నుంచి వేయి కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒరిస్సాకు కాళీకోట్ వెళ్లిన ఎస్ టీ ఎఫ్ సీ పంపిన టీమ్ స్థానిక పోలీస్‌ల సహకారం తీసుకొని సంగీతా సాహును అరెస్టు చేసి తీసుకొచ్చారు. సంగీతా సాహును అరెస్టు చేయడానికి ఒరిస్సాకు వెళ్లిన టీమ్‌లో ఎస్సై సైదులు, హెడ్ కానిస్టేబుల్ కె.శ్రీధర్, కానిస్టేబుళ్లు మహేష్, అరుణ్, మంగలు ఉన్నారు. గంజాయి లేడీ డాన్ సంగీతా సాహును ఒరిస్సాకు వెళ్లి అరెస్టు చేసి తీసుక వచ్చిన టీమ్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి అభినందించారు.
Also Read:Jagadish Reddy : రాష్ట్రా ఆదాయం తగ్గింది.. మంత్రుల ఆదాయాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి
గంజాయి లేడీ డాన్ సంగీతా సాహు ఇన్స్ట్రా గ్రామ్‌లో సినీ హీరోయిన్ లా వీడియోలు పోస్టు చేస్తుంది. గంజాయి వినియోగం ఎక్కడ ఉంటే అక్కడి వెళ్లి గంజాయి వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది సంగీతా సాహు అలియాస్ గీతా సాహు. ఒరిస్సాలోని కుర్థా జిల్లా కాళీకోట్ గ్రామానికి చెందిన సంగీతా సాహు గత నాలుగు సంవత్సరాల నుంచి హోల్‌సేల్ గంజాయి వ్యాపారంలోకి దిగింది. భువనేశ్వర్‌కు దగ్గరగా ఉండడంతో అనేక రాష్ట్రాల గంజాయి వ్యాపారులతో మాట్లాడుతూ వారికి గంజాయిని సరఫరా చేస్తు ఉంటుంది.
Also Read:Naga Vamsi : చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు.. నాగవంశీ సెన్సేషనల్..
సంగీతా సాహు గంజాయి లేడీ డాన్ ధూల్‌పేట్‌లో 29 కేజీలు, 11.3 కేజీలు రెండు కేసుల్లో పట్టు బడిన నిందితులకు గంజాయిని సరఫరా చేసింది. ధూల్‌పేట్‌లో శీలాబాయ్, నేహబాయ్, ఇష్కాసింగ్తోపాటు మరి కొంత మందికి గంజాయిని సరఫరా చేసినట్లు, పట్టుబడిన గంజాయి నిందితులు ఇచ్చిన వాగ్మూలంతో ఆమెపై ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సంగీతా సాహు 2022లో గంజాయిని హైదరాబాద్‌కు తీసుక వస్తు రైల్వే పోలీసులకు పట్టుబడింది.
తాజావార్తలు
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్‌తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్‌కు అతిథులుగా ఆ ఇద్దరూ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!