Odisha: ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. పొరుగింట్లో పెంపుడు కుక్క నిరంతరం మొరుగుతోందని.. ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఆ కుక్క యజమాని అయిన మహిళపై తీవ్ర వేధింపులకు దిగాడు. దీంతో వేధింపులకు దిగిన వ్యక్తి, సహకరించిన అతని తండ్రిపై మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. నిందితుడు తన జుట్టు పట్టుకుని రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాడని, ఆపై బట్టలు చింపాడని మహిళ తెలిపింది. అంతేకాకుండా మొరిగినందుకు నిందితుడు తన పెంపుడు కుక్క ప్రైవేట్ భాగంలోకి రాడ్‌ని చొప్పించాడని కూడా మహిళ ఆరోపించింది. ఈ మొత్తం వ్యవహారం ఒడిశాలోని భువనేశ్వర్ రాజధాని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పెంపుడు కుక్కపై పదునైన ఆయుధంతో దాడి చేసిన నిందితుడి పేరు చందన్ నాయక్. ఈ మొత్తం ఘటనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు చందన్‌పై మహిళ చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేసింది.
Read Also:Dragon Fruit Benefits : డ్రాగన్ ఫ్రూట్ ను రోజూ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?
మధ్యాహ్నం చందన్, అతని తండ్రి తన ఇంటి ముందుకి వచ్చి కేకలు వేయడం ప్రారంభించారని మహిళ పోలీసులకు తెలిపింది. అరుస్తున్నారని చెప్పి మహిళ తలుపు తెరవడంతో ఇద్దరూ ఆమెపై అసభ్యంగా ప్రవర్తించారు. తన పెంపుడు కుక్క పై దురుసుగా ప్రవర్తించడంతో.. అది కంటిన్యూగా మొరగడంతో కుక్కను వదిలి.. చందన్ తన జుట్టు పట్టుకుని రోడ్డుపైకి లాగి బట్టలు చింపాడని ఆ మహిళ తెలిపింది. ఆ తర్వాత నిందితులు ఆమెను వేధించి అత్యాచారానికి ప్రయత్నించారు. ఈ మొత్తం ఘటనలో నిందితుడి తండ్రి అతడికి మద్దతుగా నిలిచాడు. నిందితుడు తన కుక్కపై కోణాల రాడ్‌తో దాడి చేసి దాని ప్రైవేట్ భాగాలలో చొప్పించాడని మహిళ ఆరోపించింది. ఈ మొత్తం వ్యవహారంలో క్యాపిటల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పద్మనాభ్ ప్రధాన్ మాట్లాడుతూ.. మహిళ తీవ్రమైన ఆరోపణలు చేసిందని, ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని చెప్పారు. నిందితుడిపై త్వరలో చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
Read Also:Control Desires: కోరికలను అదుపులో పెట్టుకోండి.. మైనర్లకు కలకత్తా కోర్టు వార్నింగ్..