Joe Root: సచిన్ రికార్డును బ్రేక్ చేసిన జో రూట్!
- జో రూట్ ఖాతాలో మరో రికార్డు
- నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు
- 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్ బ్యాటింగ్ సంచలనం జో రూట్ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన రూట్.. ఈ ఫీట్ సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 60 ఇన్నింగ్స్‌ల్లో 1625 పరుగులు చేయగా.. రూట్ 49 ఇన్నింగ్స్‌ల్లోనే 1630 రన్స్ బాదాడు.
ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ మూడో స్థానంలో ఉన్నాడు. కుక్ 53 ఇన్నింగ్స్‌లలో 1611 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (1611-41 ఇన్నింగ్స్‌లు), విండీస్ మాజీ ఓపెనర్ శివనారాయణ్ చందర్‌పాల్ (1580-49 ఇన్నింగ్స్‌లు) టాప్-5లో ఉన్నారు. ఇప్పటివరకు 150 టెస్టులు ఆడిన జో రూట్.. 12,777 పరుగులు చేశాడు. టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. సచిన్ 15,921పరుగులతో అగ్ర స్థానంలో ఉన్నాడు.
Also Read
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్‌లో కనిపించిన కీలక లోపాలు
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్‌తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
న్యూజిలాండ్‌తో ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆదివారం 155/6 స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్ 254 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ (84) హాఫ్ సెంచరీ చేశాడు. కివీస్ నిర్దేశించిన 104 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు 12.4 ఓవర్లలోనే ఛేదించింది. జాకబ్ బెథెల్ (50 నాటౌట్; 37 బంతుల్లో) అర్ధ శతకం బాదగా.. బెన్ డకెట్ (27; 18 బంతుల్లో), జో రూట్ (23 నాటౌట్; 15 బంతుల్లో) పరుగులు చేశారు.
తాజావార్తలు
-
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
-
Android 17 Wrong Password Lock Feature: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిందే!
-
RC17 : నాకు ఆ ప్లాప్ హీరోయినే కావాలి : రామ్ చరణ్
-
Iran – Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్‌ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?