Most Test Hundreds List: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదవ బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. లార్డ్స్ మైదానంలో టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో సెంచరీ చేయడంతో రూట్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ద్రవిడ్ సహా ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ పేరిట సంయుక్తంగా ఉంది.…
ఇంగ్లండ్ బ్యాటింగ్ సంచలనం జో రూట్ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన రూట్.. ఈ ఫీట్ సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 60 ఇన్నింగ్స్‌ల్లో 1625 పరుగులు చేయగా.. రూట్ 49 ఇన్నింగ్స్‌ల్లోనే 1630 రన్స్ బాదాడు.…
Joe Root Overtakes Kumar Sangakkara in Tests: టెస్ట్ క్రికెట్‌లో వరుసగా రికార్డులు బ్రేక్ చేస్తున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఓవల్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను అధిగమించాడు.…
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన మూడో ఆటగాడిగా రూట్ రికార్డుల్లో నిలిచాడు. శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ రూట్ హాఫ్ సెంచరీ (62 నాటౌట్; 128 బంతుల్లో, 2 ఫోర్లు) చేసి.. ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశాడు.…