విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. నున్న గ్రామంలో నూతనంగా టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలో అధికార ప్రభుత్వ నాయకులు తెలుగు భాషను కు.ని చేసి బూతులు మాట్లాడం బాధాకరం అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఉద్యోగ కల్పనా కల్పించక పోగా యువతను తప్పు దారిలో నడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని…