నూతన విద్యా విధానం వినాశకరమైంది : మానిక్ సర్కార్
హైదరాబాద్‌లో ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహా సభల సందర్భంగా పీపుల్స్ ప్లాజా వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హాజరయ్యారు. బహిరంగ సభలో ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్ష, ప్రధానకార్యదర్శి వీపి. సాను, మయుక్ బిశ్వాస్, రాష్ట్ర అధ్యక్ష,కార్యద్శులు ఆర్. ఎల్. మూర్తి, నాగరాజుతో పాటు.. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మానిక్ సర్కార్ మాట్లాడుతూ.. దేశంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ సమావేశాలు జరుగుతున్నాయని, విద్యారంగం నుంచి మొదలు అన్ని రంగాలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయన్నారు. దేశ ప్రయోజనాలకు భిన్నంగా అర్ఎస్ఎస్ చేతుల్లోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని పథకం ప్రకారం ధ్వంసం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. పేదలకు విద్యను దూరం చేసి.. కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని, ఆర్ఎస్ఎస్, బీజేపీ తీసుకువచ్చిన నూతన విద్యా విధానం స్వార్థం, విభజన తత్వాన్ని పెంపొందిస్తుందని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్‌కు కోవర్ట్ రోగం పట్టింది : దామోదర రాజనర్సింహ
తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి చెలరేగుతోంది. రోజుకొకరు అసంతృప్తి నేతలు బయటికొస్తున్నారు. అయితే.. అసంతృప్తి నేతలకు ఇప్పటికీ పీసీసీ సమాధానం ఇవ్వలేదు. అయితే.. పీసీసీకి, సీఎల్పీకి గ్యాప్ ఉందని భట్టి విక్రమార్క ఒప్పుకున్నారు. అయితే.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దామోదర్ రాజనర్సింహ ఎన్టీవీతో మాట్లాడుతూ.. నాయకుడు, నాయకుల మధ్య సంపూర్ణ విశ్వాసం ఉండాలన్నారు. నాయకత్వం మీద అసంతృప్తి ఉన్న మాట నిజమేనని, పార్టీలో ఎవరి మీదా ఎవరికీ నమ్మకం లేదని ఆయన వెల్లడించారు. పదవులిచ్చినవారికి ఏ అర్హతలున్నాయని ఇచ్చారు..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో వర్గాలు కొత్త కాదని, కాంగ్రెస్‌లో గ్రూపులకు అనేక కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కోవర్టు కల్చర్ గత ఐదారేళ్ల నుంచి మొదలైందని, కోవర్ట్ కల్చర్‌ను పార్టీ నుంచి తరిమి కొట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. 2014 నుంచి వరసగా ఓడిపోతూనే ఉన్నాం, ఇలా ఎందుకు జరుగుతోందని ఆయన అన్నారు. ఢిల్లీకి వెళ్లిన పీసీసీ, మాజీ పీసీసీ, సీఎల్పీ నేతలు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ప్రతిసారీ చేసిన తప్పులే రిపీట్ అవుతున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
మన మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా పని చేద్దాం : హరీష్ రావు
నిమ్స్, ఎంఎన్ జే ఆసుపత్రుల పనితీరుపై MCRHRD నుండి జూమ్ ద్వారా ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పిల్లల్లో జన్యులోపాలు నివారించేలా ముందస్తు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు అధ్యయనం చేయాలి, నివేదిక ఇవ్వాలన్నారు. ఈ మేరకు నిమ్స్ జెనిటిక్స్ విభాగం, జేడి మేటర్నల్ హెల్త్ కు ఆదేశాలు జారీ చేశారు హరీష్ రావు. ఓపీ పెరుగుదలకు అనుగుణంగా కౌంటర్లు పెంచాలని, ఈఎండీలో బెడ్స్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేసి, అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాలని, ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షలు ఇస్తున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవయవదానంపై అవగాహన పెంచాలని, బ్రెయిన్ డెడ్ నిర్ధారణ కేసుల్లో అవయవదానం చేసేలా ప్రోత్సహించాలన్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. అవసరం అయితే నేను కూడా స్వయంగా ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించేందుకు సిద్దమన్నారు హరీష్ రావు. ‘నిమ్స్ అధ్వర్యంలో స్పోక్ మోడల్ లో వివిధ జిల్లాల్లో ఉన్న డయాలసిస్ సెంటర్లను మానిటరింగ్ చేయాలి. సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఎం ఎన్ జే కేన్సర్ ఆసుపత్రిలో 300 పడకల కొత్త బ్లాక్ వచ్చే వారంలో ప్రారంభిస్తాం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్కోవాలి. ఇది అందుబాటులోకి వస్తే మొత్తం 750 పడకలు కేన్సర్ చికిత్స కోసం అందుబాటులో ఉంటాయి. పాలియేటివ్ సేవల గురించి అవగాహన కల్పించి, ఎక్కువ మందికి సేవలు అందేలా చూడాలి.
మియా మాల్కోవాతో సెక్స్.. ఆమెలో అవే ఇష్టం : ఆర్జీవీ
అరియనా మొదలు ఇప్పుడిప్పుడు వచ్చిన సిరి స్టేజి వరకు.. వర్మతో బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి ఫేమ్ తెచ్చుకున్నవారే. ఇక తాజాగా మరో యాంకర్ అంతకు మించి అన్నట్లు వర్మను బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒక యూట్యూబ్ ఛానెల్ లో వర్మతో కలిసి ఒక యాంకర్ అతిపెద్ద బోల్డ్ ఇంటర్వ్యూకు తెరలేపింది. ఈ ఇంటర్వ్యూలో మొత్తం శృంగారం గురించి, వర్మ శృంగార జీవితం గురించి మాట్లాడి దేవుడా ఇది ఇంటర్వ్యూ నా అనిపించింది.
ఇక ఈ ఇంటర్వ్యూలో వర్మను.. ఆమె మియా మాల్కోవా గురించి కొన్ని ప్రశ్నలు వేసింది. వర్మ, మియా కలిసి జీఎస్టీ(GST) అనే ఒక సినిమా తీసిన సంగతి తెల్సిందే. మియా ఒక శృంగారతార అన్న విషయం కూడా తెలుసు. ఇక ఆ సినిమా తీసే సమయంలో ఆమెతో శృంగారంలో పాల్గొన్నారా..? అని యాంకర్ అడుగగా.. దానికి వర్మ బదులిస్తూ.. “ఆమెతో శృంగారం చేయలేదు.. ఆమె బాడీ అంతా వదులుగా మారిపోయింది.. ఆమెతో ఎలా శృంగారం చేస్తా”అని చెప్పుకొచ్చాడు. ఇక అంతేకాకుండా మియాలో తనకు అన్ని నచ్చుతాయని, ఆమె ముఖం, ఆమె యాటిట్యూడ్, ఆమె మాట్లాడే విధానము అన్ని నచ్చుతాయని, సినిమా చేసేటప్పుడు ఆమె ఎలా చేసింది అని చూశానే కానీ, ఆమె బాడీ కానీ, మరింకేదైనా కానీ చూడలేదని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
త్వరలో సీఎంగా కనిపించబోతున్న బాలకృష్ణ..?
నందమూరి బాలకృష్ణ త్వరలో సీఎం కానున్నారు.. ఏంటి నిజమా..? అంటే నిజమే కానీ రియల్ గా రీల్ లో.. ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా మారిన బాలకృష్ణ మరో సినిమాను లైన్లో పెట్టాడు. మహేష్ తో కలిసి సర్కారు వారి పాట సినిమా తీసిన పరుశురామ్ తన తదుపరి సినిమా బాలయ్యతో ఉండనున్నదని టాక్ నడుస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ కథను రాసుకున్నాడట పరుశురామ్. ఇక ఈ చిత్రంలో బాలయ్య సీఎం గా కనిపించనున్నాడట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని చెబుతున్నారు. ఇప్పటికే బాలయ్య ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.
అభిమానులకు కూడా బాలయ్య హీరోగానే కాకుండా పొలిటీషియన్ గా కూడా సుపరిచితుడే. దీంతో ఈ పాత్రకు అభిమానులు త్వరగా కనెక్ట్ అవుతారు అని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి మాత్రం కొద్దిగా సమయం పడుతుంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే బాలయ్య చేతిలో వరుస ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. వీరసింహారెడ్డి ని పూర్తిచేసి ఇటీవలే అనిల్ రావిపూడి సినిమాను మొదలుపెట్టాడు. దీని తరువాత తన స్వీయ డైరెక్షన్ లో ఆదిత్య 999 మ్యాక్స్ సినిమా చేయాలని చూస్తున్నారు బాలయ్య బాబు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని సమాచారం. ఇవన్నీ పూర్తీ అయ్యాక కానీ, పరుశురామ్ తో సినిమా పట్టాలెక్కదు. మరి వచ్చే ఏడాది ఏమైనా పరుశురామ్ ఛాన్స్ అందుకుంటాడేమో చూడాలి.
రేపు విశాఖ, గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వెస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. బుధవారం రోజు విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.. రేపు ఓ వైసీపీ ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి.. మరో వైపు మాజీ మంత్రి కూతురు పెళ్లి వేడుకకు హాజరుకాబోతున్నారు.. విశాఖ, గుంటూరు జిల్లాల పర్యటన కోసం రేపు మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సాయంత్రం 4 గంటలకు దాకమర్రి చేరుకుంటారు.. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు.. నూతన దంపతులను ఆశీర్వదించిన తర్వాత తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సాయంత్రం 6.30 గంటలకు నేరుగా మంగళగిరి చేరుకోనున్నారు సీఎం జగన్… సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొననున్న ఆయన.. నూతన దంపతులను ఆశీర్వదించిన అనంతరం.. తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.
టీటీడీ ఈవోకు నెల రోజుల శిక్ష, జరిమానా
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డికి షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కోర్టు ఉత్తర్వులు అమలు చెయ్యలేదని టీటీడీ ఈవోకు శిక్ష విధించింది.. దాంతో పాటు రూ. 2 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా.. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఈ తీర్పు వెలువరిస్తున్నామని స్పష్టం చేసింది. కాగా గతంలో టీటీడీలో పని చేస్తున్న ముగ్గురు తాత్కాలిక సిబ్బంది క్రమబద్దీకరణ కోసం కోర్టును ఆశ్రయించగా, ముగ్గురిని క్రమబద్దీకరించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, కోర్టు ఆదేశాలు అమలు చేయలేదు.. దీంతో ఉద్యోగులు కోర్టు ధిక్కారణ పిటిషన్ వేశారు.. దీనిపై విచారించిన కోర్టు.. ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ మధ్యహ్నం 12 గంటల సమయంలో కోర్టు ఉత్తర్వులు అమలు చెయ్యలేదంటూ టీటీడీ ఈవోకి నెలరోజుల శిక్ష విధించిన హైకోర్టు సింగిల్ బెంచ్.. రెండు వేల జరిమానా విధించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు 27వ తేదీలోపు అమలు చేయపోతే శిక్షా ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించింది.. మరో వైపు సింగిల్ బెంచ్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై మధ్యహ్నం 2 గంటల సమయంలో స్టే విధించింది డివిజన్ బెంచ్.. అయితే, టీటీడీ ఈవోపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లనుంది టీటీడీ.
శ్రీశైలం రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. ఈ మధ్యే ఏపీలో పర్యటించిన ఆమెకు ఏపీ ప్రభుత్వం ఘనంగా పౌర సన్మానం చేసింది. పోరంకిలో గవర్నర్ బిష్వభూషన్ హరిచందన్.. సీఎం జగన్ ఆమెకు సన్మానం చేశారు. మూడు రోజుల పాటు జరిగిన పర్యటనలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.. అయితే, ఇప్పుడు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించనున్నారు రాష్ట్రపతి.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. ఈ నెల 26వ తేదీన శ్రీశైలం రాబోతున్నారు రాష్ట్రపతి.. ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో శ్రీశైలం చేరుకుంటారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మధ్యాహ్నం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకోనున్నారు.. ఆ తర్వాత కేంద్ర టూరిజంశాఖ ద్వారా శ్రీశైలం దేవస్థానం చేపట్టిన ప్రసాదం స్కీమ్ పనులను ప్రారంభించనున్నారు.. కేంద్ర టూరిజం శాఖ 2014-15లో ఈ ప్రసాద్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా పుణ్యక్షేత్రాలను పూర్తిస్థాయిలో అభివృద్ది చేయనున్నారు. టూరిస్టులను ఆకర్షించేందుకు వీలుగా మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. ఇక, రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా.. శ్రీశైలం దేవస్థానం.. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. భారీ బందోబస్తు ఏర్పాటు చేయనుంది..
టెక్కీలకు షాక్.. ఉద్యోగుల తొలగింపు ప్రారంభించిన సిస్కో..
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్భనం, ఆదాయం తగ్గిపోవడవంతో టెక్ దిగ్గజాలు వరసగా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో మరో టెక్ దిగ్గజ సంస్థ చేరింది. సిస్కో గత నెలలో 4000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో దాదాపుగా 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని అంచనాలు చెబుతున్నాయి. తాజాగా సిస్కో కంపెనీ తన ఉద్యోగులకు తొలగింపు విషయాన్ని తెలిపింది. సిస్కో తన వర్క్ ఫోర్స్ లో 5 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది.
ఆర్థిక మాంద్యం పరిస్థితుల వల్ల టెక్ రంగం కుదేలు అవుతోంది. ఇప్పటికే మెటా, అమెజాన్, ట్విట్టర్, లెనోవో, సేల్స్ ఫోర్స్, అడోబ్, గూగుల్ వంటి సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించాయి. ఇప్పటికే ట్విట్టర్ తన కంపెనీలో 50 శాతం అంటే దాదాపుగా 3800 మందిని, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా 13 శాతం అంటే 13,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక గూగుల్ 10,000 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. అమెజాన్ ఏకంగా 20 వేల మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది.
బ్రిటన్, అమెరికా ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయి. అమెరికా ఆర్థికవేత్తల ప్రకారం వచ్చే 6 నెలల నుంచి ఏడాది కాలంలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నట్లు వెల్లడిస్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతోంది. అయితే ఆర్థిక మాంద్యం పరిస్థితి ముందుగా టెక్ సంస్థలపై పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీని ప్రభావం ఇండియా ఐటీ ఇండస్ట్రీపై కూడా పడబోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే దేశీయ టెక్ దిగ్గజ కంపెనీలు ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్లు ఇచ్చి వెనక్కి తీసుకుంటున్నాయి. దీంతో రానున్న కాలంలో ఇండియన్ ఐటీ పరిశ్రమ కుదేలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అరుణాచల్ ప్రదేశ్ ఘర్షణపై స్పందించిన చైనా..
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎల్ఏసీ వెంబడి భారత్, చైనా దళాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై తొలిసారిగా చైనా స్పందించింది. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉందని ఆయన అన్నారు. డిసెంబర్ 9 అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో భారత్, చైనా దళాల మధ్య ఘర్షణ నెలకొంది. అయితే సరిహద్దు సమస్యను దౌత్యం, సైనిక మార్గాల ద్వారా ఇరు దేశాలు సంప్రదింపులు కొనసాగించాలని ఆయన అన్నారు. డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనా, భారత సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు భారత సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. భారత్, చైనా సైనికులకు గాయాలు అయినట్లు వెల్లడించింది. తవాంగ్ సెక్టార్ లో 200 మందికి పైగా చైనా సైనికులు కర్రలతో భారత సైనికులపై దాడికి ప్రయత్నించారు. ఈ దాడిని భారత సైనికులు తిప్పికొట్టారు. గతంలో గాల్వాన్ లోయ ఘర్షణల అనంతరం 30 నెలల తర్వాత మళ్లీ ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.