Cash Usage Declined: ప్రపంచమంతా డిజిటల్ యుగం నడుస్తోంది. ఇంటర్నెట్ యుగంలో…ఏం చేయాలన్నా ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నారు. పది రూపాయల పేమెంట్ నుంచి పది లక్షల దాకా…అన్నీ లావాదేవీలు…ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. విత్ డ్రాయల్ ఫామ్ రాసి…క్యూలో వెళ్లి నిల్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకే ఒక్క క్లిక్‌తో మనీ ట్రాన్స్‌ఫర్. రూపాయిల నుంచి లక్షల దాకా. బ్యాంక్ నుంచి డ్రా చేసుకొస్తే…సేఫ్టీగా ఇంటికి వస్తామో లేదో తెలియదు. అందుకే జనమంతా ఆన్‌లైన్ పేమెంట్స్…ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కు అలవాటు పడిపోయారు. ఇంకా చెప్పాలంటే…ఆన్‌లైనే సర్వాంతర్యామి. ప్రస్తుతం మార్కెట్‌లో డిజిటల్ పేమెంట్స్ హవా నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారంతా…యూపీఐ సేవలనే యూజ్ చేస్తున్నారు. కూరగాయాలు కొన్నా…జనరల్ స్టోర్‌కు వెళ్లినా…కరెంట్ బిల్ కట్టినా…ఫుడ్ ఆర్డర్ పెట్టినా…అన్ని ఆన్‌లైన్ ద్వారానే పేమెంట్స్ చేస్తున్నారు. టెక్ యుగంలో…ప్రస్తుతం నగదు వాడకాన్ని జనం పూర్తిగా తగ్గించేశారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో క్షణాల్లో…క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. చాయ్ బండి నుంచి స్టార్ హోటల్ దాకా…అన్నింటికి ఆన్‌లైన్‌లోనే పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో బయట మార్కెట్‌లో క్యాష్ చూద్దామంటే కూడా కనిపించడం లేదు. ఒక్క సెప్టెంబరు నెలలోనే 1963 కోట్ల రూపాయిల డిజిటల్ పేమెంట్స్ జరిగినట్లు ఎన్‌పీసీఐ లెక్కలు చెబుతున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఇండియా లెక్కల ప్రకారం.. మార్కెట్ సినారియో టోటల్ డిఫరెంట్‌గా ఉంది. మార్కెట్ క్యాష్ చాలామణి లేదా అంటే భారీగానే ఉంది. పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో నగదు వినియోగం తగ్గిపోయింది. అయితే లావాదేవీలన్నీ యూపీఐ లేదా ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు జనాలు. యూపీఐ సేవలను జనాలు వినియోగిస్తున్నప్పటికీ…నోట్ల చాలామణి అదే రేంజ్‌లో ఉన్నట్లు ఆర్బీఐ నివేదికలు చెబుతున్నాయి. డీమానిటైజేషన్‌కు ముందు దేశంలో 17 లక్షల కోట్లకు పైగా జనం దగ్గర ఉండేది. కానీ ఇప్పుడు 38 లక్షల కోట్ల రూపాయల డబ్బు మార్కెట్‌లో ఉందని చెప్తున్నాయి రిజర్వ్ బ్యాంక్ లెక్కలు. ఈ లెక్కలను బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఫిజికల్ క్యాష్‌కు ఎలాంటి లోటు లేదు. కానీ ఉన్న డబ్బంతా వ్యాపారుల చేతుల్లోనే ఉందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు…దేశం మొత్తం తిరిగి రావచ్చు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎవరికైనా ఫిజికల్ క్యాష్ కావాలంటే…ఏటీఎంకు వెళ్తే తప్పా దొరికే ప్రసక్తి లేదు. చిన్న టీ షాప్ నుంచి పది.. ఇరవై లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. కనీసం ఈ రెండు వేలో.. ఐదు వేలో క్యాష్ కావాలని అడిగితే.. అందరి సమాధానం ఓన్లీ ఆన్లైన్ అంటున్నారు. అయితే ఈ పరిస్థితి రావడానికి డిజిటల్ సేవలు పెరగడమే కారణం. రియల్ ఎస్టేట్ వ్యాపారం మరో కారణం అని చెబుతున్నారు ఫైనాన్స్.. బ్యాంకింగ్ నిపుణులు.
తెలుగు రాష్ట్రాల్లో.. పెద్దఎత్తున జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగమనంలో ఉంది. రియల్ రంగంలో లావాదేవీలు తగ్గిపోవడంతో…నగదు వాడకం తగ్గిపోయిందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది వాస్తవం కాదని…బ్యాంక్‌ల నుంచి నగదు డ్రా చేసుకొని…పెద్ద ఎత్తున నిల్వ చేసుకుంటున్నారని అంటున్నారు. రియల్ ఎస్టేట్లో మార్కెట్ వాల్యూ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రభుత్వ.. రెండు బయట మార్కెట్. అయితే బయట మార్కెట్లో వాల్యూ వంద శాతం ఉంటే.. ప్రభుత్వానికి మాత్రం దాని వ్యాల్యూ నలభై శాతంగానే చెప్పుకుంటారు.. నలభై కంటే తక్కువ గాను ఉంటుంది. అయితే ఇదేలా కారణం అంటారా.! ఉన్నదంతా ఇక్కడే.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ వ్యాల్యూ అమౌంట్ వైట్ లో ఇచ్చి.. మిగిలిన ఇరవై శాతం అమౌంట్‌ను బ్లాక్‌లో ఇస్తారు. సో ఇప్పుడు వ్యాపారం లేకపోవడంతో…ఆ మనీ అంతా రియల్ ఎస్టేట్ చేసే పెద్ద వ్యాపారులతోనే స్ట్రక్ అయ్యిందని.. ఇదే క్యాష్ కొరతకు ప్రధాన కారణం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.
తొలుత యూపీఐని ప్రారంభించినప్పుడు…దీన్ని గ్రామీణ ప్రాంతాలకు చేర్చడం కష్టమని అనుకున్నారంతా..! కానీ అందరూ మొబైల్ ఫోన్ లకు అలవాటు పడటంతో యూపీఐ కూడా దానిలో భాగం అయ్యింది. ఇప్పుడు ఫిజికల్‌గా డబ్బును చూద్దాం అంటే కనిపించడం గగనమైపోయింది. ఇక కాయిన్స్ కనిపించడం లేదు. చిన్న చాక్లెట్ కావాలన్న.. పది లక్షల అమౌంట్ పంపాలన్న అంతా ఆన్లైనే. పల్లెటూరులో కిరణా షాప్స్ నుంచి సిటీస్ లో ఉండే మాల్స్ వరకు ఇలా ఒకటి రెండు కాదు.. అన్ని రంగాల్లో యూపీఐ భాగమైంది. ఇప్పుడు ఇదే యూపీఐ ట్రాన్సాక్షన్స్ వందల కోట్లకు చేర్చింది. దేశ వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ గణనీయంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా… దేశంలో పదిహేను వ్యాపార రంగాల లావాదేవీలు డెబ్భై శాతం. వీటిలో కిరాణా సామాగ్రి కొనుగోళ్లు అతిపెద్ద విభాగంగా ఉన్నాయని ఎన్పీసీఐ చెబుతోంది. దేశంలో యూపీఐ వంటి డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాక.. దేశంలోని అన్ని బ్యాంకులు తమ సేవలను ఆన్లైన్ చేశాయి. అసలు డబ్బులను చూద్దామంటే కూడా కష్టమవుతుంది. మొత్తంగా రాబోయే రోజుల్లో డిజిటల్ పేమెంట్స్ మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది ఎన్పీసీఐ.