గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల తల్లిదండ్రులుగా మారారు.. ఇండస్ట్రీలో బ్యూటీఫుల్ కపుల్ గా ఉన్న వీరు పెరేంట్స్ అయ్యారు..ఈ ఉదయమే వీరికి పండంటి ఆడబిడ్డ జన్మించింది. మహాలక్ష్మి పుట్టడంతో మెగా ఫ్యామిలీ కూడా పట్టలేని ఆనందంలో మునిగి తేలుతుంది.. తమ సంతోషాన్ని ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.ఇప్పటికే చిరంజీవి తన మనవరాలి రాకతో ఎంతగానో ఆనందంగా వున్నారు.. లిటిల్ మెగా ప్రిన్సెస్ అనే టైటిల్ తో స్వాగతం కూడా పలికారు. మెగా అభిమానులు కూడా ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగా ప్రిన్సెస్ హ్యాష్ ట్యాగ్ ను దేశ వ్యాప్తంగా వారు ట్రెండింగ్ చేస్తున్నారు. రామ్ చరణ్ కు ప్రాణ స్నేహితుడైన జూనియర్ ఎన్టీఆర్ కూడా మెగా ప్రిన్సెస్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్వీటర్ వేదిక రాంచరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ కూడా చేశారు.
ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘రామ్ చరణ్ – ఉపాసన మీకు నా శుభాకాంక్షలు. పెరేంట్స్ క్లబ్ లోకి మిమల్ని నేను ఆహ్వానిస్తున్నాను. పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఆడబిడ్డతో గడిపే ప్రతిక్షణం ఎంతో బాగుంటుంది. ఆ దేవుడు మీ అందరికీ మరింత సంతోషాన్ని అందించాలని నేను ఆశిస్తున్నాను’ అంటూ విష్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ బాగా వైరల్ గా మారింది.ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. దీంతో వీరిద్దరూ గ్లోబల్ స్టార్స్ గాను గుర్తింపు ను దక్కించుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ అనే చిత్రంలో నటిస్తున్నారు. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలోని ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ పండంటి ఆడబిడ్డ పుట్టడంతో కొద్దిరోజులు షూటింగ్ లు అన్నింటిని వాయిదా వేశారని తెలుస్తోంది. రాంచరణ్ పూర్తి సమయం అంతా తన ఫ్యామిలీకే కేటాయించేలా ప్లాన్ చేసుకున్నారని సమాచారం.