ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబో అంటేనే అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. అలాంటిది, ఆ సినిమా అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూడడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు వైరల్ అవుతున్న క్రేజీ టాక్ ఏంటంటే.. సంక్రాంతికి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి నీల్ ఒక మెంటల్ మాస్ ట్రీట్ ప్లాన్ చేశారట! ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, దానితోపాటే సినిమాలో తారక్ పోషిస్తున్న పాత్ర పేరును ఒకేసారి రివీల్ చేయడానికి టీమ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం తారక్ తన లుక్ పూర్తిగా మార్చుకుని, సన్నబడి మరిన విషయం తెలిసిందే. అందుకే, ఆ కొత్త లుక్ ఎలా ఉంటుందో చూడాలని కేవలం తెలుగు ఫ్యాన్స్‌కే కాదు, పాన్ ఇండియా ఆడియన్స్‌కి కూడా ఆత్రుతగా ఉంది.
Also Read : Mokshagna : ‘ఆదిత్య 999 మ్యాక్స్’లో మోక్షజ్ఞకు పవర్‌ఫుల్ విలన్ ఫిక్స్?
ఈ సినిమా మెయిన్ షూటింగ్ జనవరి ఎండింగ్‌కల్లా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే, సరిగ్గా ఈ పండుగ సీజన్‌ని వాడుకుని, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమాపై మరింత హైప్ పెంచాలని మేకర్స్ డిసైడ్ అయ్యారని సమాచారం. ఇది ఒక ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా, ‘కేజీఎఫ్’ రేంజ్‌కి తగ్గకుండా, ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇది ఒక మాస్టర్‌పీస్‌గా నిలిచేలా ప్రశాంత్ నీల్ ఎంతో జాగ్రత్తగా డీల్ చేస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. ఇంకొన్ని రోజుల్లోనే ఈ పండుగ అప్‌డేట్‌పై అధికారిక ప్రకటన రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.