ప్రతి హీరోలో ఏదొక ప్రత్యేకత ఉంటుంది.. తన సినిమాలతో ఎంతో మంది అభిమానుల మనసును గెలుచుకుంటున్నారు.. తన కోసం ఏదైనా చేసేలా చేస్తున్నారు.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలను మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో అభిమాని ఎన్టీఆర్ పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తమ హీరో కోసం ఎంతవరకైనా వెళతారు.. ఒంటి మీద టాటూలు వేయించుకుంటారు. వాళ్ళు ధరించిన బట్టలను పోలిన బట్టలు వేసుకుంటారు. విగ్రహాలు కూడా కడతారు. చెప్పాలంటే ఇంకా చాలానే ఉన్నాయి. కాగా ఓ అభిమాని మరింత భిన్నంగా ఆలోచించాడు. తన కలల ఇంటిని ఎన్టీఆర్ పేరున నిర్మించుకోవాలి అనుకున్నాడు.. దానికోసం ఒక ఆలోచన చేశాడు.. ఎన్టీఆర్ అభిమాని ప్రతి ఇటుక మీద ఎన్టీఆర్ అనే పేరు వచ్చేలా తయారు చేయించాడు. బట్టీ కార్మికులకు చెప్పి ఎన్టీఆర్ పేరు అచ్చుతో ఇటుకలను రూపొందించాడు.
తన కొత్త ఇంటికి వాడిని ప్రతి ఇటుక మీద ఎన్టీఆర్ పేరు ఉండాలని అతడు కోరుకున్నాడట.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..ఇక సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మొన్నటి వరకు హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్స్ లో షూటింగ్ జరిగింది. ప్రస్తుతం గోవాకు షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం గోవాలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అనంతరం వైజాగ్ తో పాటు మరికొన్ని తీర ప్రాంతాల్లో షూటింగ్ జరగనుందని సమాచారం.. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటించారు.. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది..