NTR Centenary Celebrations: 28న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. భూమి పూజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రుల ఆరాధ్యదైవం, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలకు విజయవాడ సిద్ధమవుతోంది. ఈ నెల 28వ తేదీన విజయవాడకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలయ్య రానున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు రజనీకాంత్, బాలయ్య, చంద్రబాబు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలతో కూడిన పుస్తకాన్ని విడుదల చేయనున్నారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సావనీర్ కమిటీ. కార్యక్రమం నిర్వహించే ప్రాంగణంలో పనులు ప్రారంభిస్తూ భూమి పూజ చేశారు కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్, టీడీపీ నేతలు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సావనీర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్ధన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం.ఈ నెల 28వ తేదీన జరిగే సభకు చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ వస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ప్రసంగాల పుస్తకం ఆవిష్కరిస్తాం అన్నారు.
ఎన్టీఆర్ వెబ్ సైట్, సావనీర్ హైదరాబాద్ లో త్వరలోనే ఆవిష్కరిస్తాం అన్నారు. ఎన్టీఆర్ యాప్ ను నారా లోకేష్ ప్రారంభిస్తారు.రామారావు గారికి రామారావుగారే సాటి.సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారు. ఎనిమిది నెలలుగా మా కమిటీ వీటి మీద పని చేసింది. నాజర్ అబ్బాయి బాబ్జీతో ఎన్టీఆర్ చరిత్ర పై బుర్ర కథ. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆరోజు ఉంటాయన్నారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాల పుస్తకం ఆవిష్కరణ ఉంటుంది. సీనియర్ జర్నలిస్టు వెంకట నారాయణ ఈపుస్తకాన్ని రాశారు. టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటేనే ఒక చరిత్ర. సినిమా, రాజకీయ రంగాల్లో ప్రత్యేక శైలి ఎన్టీఆర్ ది.
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
Read Also: Truck Loses Control: పెట్రోల్ పంప్ లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. తర్వాత ఏం జరిగిందంటే..
చరిత్రలో గుర్తు ఉండిపోయేలా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేస్తున్నారు.కమిటీ ఛైర్మన్ టీడీ జనార్ధన్ ఆధ్వర్యంలో అనేక సభలు జరుపుతున్నారు.ప్రజలు కూడా ఎన్టీఆర్ చరిత్ర గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఈ తరం కూడా ఎన్టీఆర్ గురించి ఆసక్తిగా వినడం గొప్ప విషయం అన్నారు కొనకళ్ళ నారాయణ. టీడీపీ సీనియర్ నేత. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగాల్లో రారాజు ఎన్టీఆర్.పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో సిఎం అయిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. పేదలను దృష్టిలో ఉంచుకుని అనేక సంక్షేమ పధకాలు అమలు చేశారు.వంద సభలు నిర్వహించి, మే 28 శత జయంతిని గొప్పగా నిర్వహిస్తున్నాం.ఈ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు పాల్గొంటున్నారని అన్నారు.
టీడీపీ సీనియర్ నేత బోడే ప్రసాద్ మాట్లాడుతూ.. నా నియోజకవర్గంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉంది.చంద్రబాబు, బాలకృష్ణ, రజనీకాంత్ ఒకే వేదిక మీద చూడటం కనుల విందుగా ఉంటుంది.లక్షలాది మంది అభిమానులు ఈ శత జయంతి ఉత్సవాల్లో భాగం అవుతున్నారు.ఎన్టీఆర్ చరిత్ర, ఆయన గొప్పతనం గురించి అందరూ తెలుసుకోవాలన్నారు బోడె ప్రసాద్.
Read Also: Ramabanam: ఈ లవ్ మెలోడి బాగుంది గురూ…
తాజావార్తలు
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!