గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమాల లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాను అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. అందుకే మిగిలిన షూటింగ్ పార్ట్ ను త్వరగా ఫినిష్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ అన్ని కూడా సినిమాకు హైప్ ను తీసుకొస్తున్నాయి..
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ గ్యారేజీ లోకి మరో కొత్త కారు వచ్చేసింది.. ఆ కారు ధర అందరిని ఆశ్చర్యపరుస్తుంది.. ఎన్టీఆర్ తాజాగా ఓ కొత్త కారుని కొన్నారు. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం నేడు ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కి వచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
కారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఎన్టీఆర్ బ్లాక్ టి-షర్ట్ లో కాలింగ్ గ్లాస్సెస్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కాగా కొత్త కారు కలర్ ‘నౌటిక్ బ్లూ’లా కనిపిస్తుంది. అదిరిపోయే లుక్ లో ఉన్న ఈ కారు ఫీచర్స్ విషయానికొస్తే.. Mercedes-Benz Maybach S-Class S 580. ఈ కారు విలువ మార్కెట్ లో దాదాపు రూ.2.72 కోట్లకు పైగా ఉంటుందని అంచనా . అయితే ఎన్టీఆర్ దగ్గర ఇప్పటికే చాలా కార్లు ఉన్నాయి. అత్యంత ఖరీదైన కార్లు ఉన్నా కూడా ఎన్టీఆర్ మరో కారును కొన్నాడు.. ఇది విన్న ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతున్నారు.. సినిమాల విషయానికొస్తే.. దేవర తో పాటుగా మరో సినిమాను లైన్లో పెట్టాడు.. అలాగే బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నాడు..