Ntr-Hrithik Roshan War2:బాలీవుడ్‌లో ఇదివరకు సంచలన విజయం అందుకున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ “వార్”కు సీక్వెల్‌గా రాబోతున్న చిత్రం ‘వార్ 2’. 2019లో విడుదలైన మొదటి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు ఈ సీక్వెల్‌కి మరింత క్రేజీగా రూపొందించడానికి పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు. ఇది ఎన్టీఆర్‌కి బాలీవుడ్‌లో తొలి చిత్రం కావడంతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ‘బ్రహ్మాస్త్ర’ వంటి విజువల్ వండర్‌ని తెరపైకి తీసుకొచ్చిన అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సరికొత్త మేకింగ్ స్టైల్, ఇంటెన్స్ కథాంశం ఉండబోతున్నట్లు సమాచారం.
Read Also: Inter Supplementary : మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్ టికెట్లు ఎప్పుడంటే..?
ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందనేది అభిమానుల్లో పెద్ద క్యూరియాసిటీగా మారింది. కొన్ని లీకుల ప్రకారం, ఆయన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని, అయితే అది పూర్తిగా విలన్ కాదని.. గ్రే షేడ్స్ కలిగిన పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని సమాచారం. స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్ స్క్రీన్‌పై ఎలా కనిపిస్తాడన్నదే ఇప్పుడు ప్రధాన చర్చాంశం. ఇక ఈ సినిమాకు సంబంధించి టీజర్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్‌ను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉంది.
Read Also: Inter Supplementary : మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్ టికెట్లు ఎప్పుడంటే..?
Hey @tarak9999, think you know what to expect on the 20th of May this year? Trust me you have NO idea what’s in store. Ready?#War2
— Hrithik Roshan (@iHrithik) May 16, 2025
అయితే, దీనిపై అధికారికంగా ప్రకటించకపోయినా హృతిక్ రోషన్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందన్న స్టైల్ లో చేసిన ఆ ట్వీట్‌తో టీజర్ వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. వారు ఇద్దరూ స్క్రీన్‌పై ఫైట్ చేసే సీన్స్, యాక్షన్ బ్లాక్‌లు, ఎమోషనల్ క్లాష్ అన్నీ కలిపి వార్ 2 సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేసుందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.