Novak Djokovic: రోజర్ ఫెడరర్ రికార్డుకు చెక్ మెట్.. వింబుల్డన్‌లో చరిత్ర సృష్టించిన జొకోవిచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Novak Djokovic: వింబుల్డన్ టెన్నిస్ చరిత్రలో మరో అరుదైన ఘట్టం నమోదైంది. సెర్బియాకు చెందిన స్టార్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జొకోవిచ్ పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. రష్యాకు చెందిన రోమన్ సఫియుల్లిన్పై నాలుగు సెట్ల పోరులో విజయం సాధించిన జొకోవిచ్, వింబుల్డన్‌లో తన 106వ సింగిల్స్ విజయాన్ని నమోదు చేసి స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.
ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 7-6 (8-6), 6-3, 3-6, 6-3 తేడాతో సఫియుల్లిన్ను ఓడించాడు. ఈ విజయంతో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. కాగా మహిళల విభాగంలో 120 విజయాలతో మార్టినా నవ్రాటిలోవా ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ విజయం జొకోవిచ్‌కు అంత సులభంగా రాలేదు. మ్యాచ్ ఆరంభంలో కంటి సమస్యతో అసౌకర్యానికి గురైన అతడు, మ్యాచ్ మధ్యలో తన భావోద్వేగాలను నియంత్రించుకోలేక అంపైర్ నుంచి హెచ్చరిక కూడా అందుకున్నాడు. మూడో సెట్లో సర్వీస్ కోల్పోయిన తర్వాత బంతిని కోర్టు అవతలివైపు బలంగా కొట్టడంతో మరోసారి చర్చనీయాంశమయ్యాడు.
Also Read
- AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జిల్లా కలెక్టరేట్లలో భారీ మార్పులు..!
- 185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
- Ayodhya Ram Mandir Trust: నేటి అయోధ్య ట్రస్ట్ భేటీపై ఉత్కంఠ.. ఐదు ప్రధాన అజెండాలు
- Fire Accident: నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్ని ప్రమాదం
మ్యాచ్ అనంతరం జొకోవిచ్ మాట్లాడుతూ.. “కోర్టులో కొన్నిసార్లు నా భావోద్వేగాలను బయటపెడుతుంటాను. ఈరోజు కూడా అలాంటి కొన్ని సందర్భాలు జరిగాయి. అందుకు క్షమాపణలు చెబుతున్నాను. మనసును ప్రస్తుత క్షణంలో ఉంచుకోవడం చాలా కష్టం. దాన్ని సాధించినవారే నిజమైన విజేతలు” అని అన్నారు. మరోవైపు, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 132వ స్థానంలో ఉన్న రోమన్ సఫియుల్లిన్ జొకోవిచ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. క్వాలిఫయర్‌గా ప్రధాన డ్రాలోకి వచ్చిన సఫియుల్లిన్, ఈ టోర్నీలో ఇప్పటికే మూడు ఐదు సెట్ల మ్యాచ్‌లు గెలిచి నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. అలాగే 12వ సీడ్ ఆండ్రీ రుబ్లెవ్‌ను కూడా ఓడించి సంచలనం సృష్టించాడు.
మ్యాచ్‌లో తొలి సెట్లో వెనుకబడినప్పటికీ సఫియుల్లిన్ తిరిగి పుంజుకుని టైబ్రేక్ వరకు పోరాడాడు. మూడో సెట్లో ఎడమ కాలి సమస్యతో మెడికల్ టైమ్అవుట్ తీసుకున్నప్పటికీ, అదే సెట్‌ను గెలుచుకుని జొకోవిచ్పై తన తొలి సెట్ విజయాన్ని నమోదు చేశాడు. అయితే నాలుగో సెట్లో జొకోవిచ్ మళ్లీ ఆధిపత్యం చెలాయించి మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో జొకోవిచ్ తన కెరీర్లో 17వసారి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. తర్వాతి మ్యాచ్‌లో కెనడాకు చెందిన మూడో సీడ్ ఫెలిక్స్ ఆగర్-అలియాసిమ్ లేదా స్పెయిన్‌కు చెందిన అలెజాండ్రో డేవిడోవిచ్ ఫోకినా విజేతతో తలపడనున్నాడు.
ప్రస్తుతం జొకోవిచ్ ఎనిమిదో వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ కోసం పోరాడుతున్నాడు. ఆ టైటిల్ సాధిస్తే రోజర్ ఫెడరర్ పేరిట ఉన్న ఎనిమిది వింబుల్డన్ టైటిళ్ల రికార్డును సమం చేస్తాడు. అంతేకాకుండా తన కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను కూడా లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు.
తాజావార్తలు
-
Novak Djokovic: రోజర్ ఫెడరర్ రికార్డుకు చెక్ మెట్.. వింబుల్డన్‌లో చరిత్ర సృష్టించిన జొకోవిచ్.!
-
Fertilizers: రైతులకు ఊరట! యూరియా, డీఏపీతో నిండిన 15 నౌకలు వచ్చేస్తున్నయ్.. ఎరువుల సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
God of War: ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై రాజకీయ దుమారం.. తమిళనాడులో విడుదల అడ్డుకుంటామంటూ హెచ్చరిక
-
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జిల్లా కలెక్టరేట్లలో భారీ మార్పులు..!
ట్రెండింగ్
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!