NTV Telugu Site icon

Virat Kohli Century: బర్త్‌డే రోజు సెంచరీ చేసింది విరాట్ ఒక్కడే కాదు.. ప్రపంచకప్‌ 2023లోనే మరో ప్లేయర్!

Virat Kohli 49th Century

Virat Kohli 49th Century

List of Players Who Hit Centuries on Their Birthday: బర్త్‌డే రోజే ‘సెంచరీ’ చేయాలని ప్రతి క్రికెటర్ అనుకుంటాడు. అది ఓ చిరస్మరణీయ ఘట్టంలా భావిస్తారు. అయితే అదంతా ఈజీ కాదు.. అందులోనూ ప్రపంచకప్‌ లాంటి పెద్ద టోర్నీలో అసలు సాధ్యం కాదు. మెగా టోర్నీలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది కాబట్టి.. చాలా తక్కువ మంది బ్యాటర్లు మాత్రమే శతకాలు చేస్తుంటారు. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన 35వ బర్త్‌డే రోజున సెంచరీ చేశాడు. అది అతడికి ఓ మధుర జ్ఞాపకంగా నిలిచింది.

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ సెంచరీ చేశాడు. 120 బంతుల్లో 100 మార్క్ అందుకున్నాడు. తన 35వ పుట్టిన రోజున వన్డేల్లో 49వ సెంచరీ నమోదు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో రెండో శతకం నమోదు చేశాడు. అయితే పుట్టిన రోజు నాడు ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన ఆటగాడు కోహ్లీ మాత్రమే అనుకుంటే పొరపడినట్టే. విరాట్ కంటే ముందే ఇద్దరు శతకాలు బాదారు.

Also Read: Delhi Air Pollution: ఢిల్లీలో తీవ్రంగానే వాయు కాలుష్యం.. మొదలైన బంగ్లాదేశ్‌, శ్రీలంక మ్యాచ్‌!

వన్డే ప్రపంచకప్‌ 2023లోనే ఆస్ట్రేలియా స్టార్ మిచెల్‌ మార్ష్‌ తన పుట్టినరోజు నాడు సెంచరీని బాదాడు. మిచెల్‌ పుట్టిన రోజు అక్టోబర్ 20 కాగా.. అదే రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్తాన్‌పై జరిగిన మ్యాచ్‌లో 121 పరుగులు చేశాడు. ఇంతకుముందు న్యూజీలాండ్ మాజీ ఆటగాడు రాస్‌ టేలర్‌ పుట్టినరోజు నాడు సెంచరీ చేశాడు 2011 ప్రపంచకప్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. మొత్తంగా పుట్టినరోజు నాడు సెంచరీ చేసిన ఆటగాళ్లు 7 మంది ఉన్నారు. వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య, టామ్ లాతమ్ ఈ జాబితాలో ఉన్నారు.

Show comments