Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News North Korea Fires 2 Ballistic Missiles 2

North Korea: మరోసారి కిమ్‌ కవ్వింపు చర్యలు.. రెండు బాలిస్టిక్‌ క్షిపణులు ప్రయోగం..

Published Date :December 18, 2022 , 5:39 pm
By Mahesh Jakki
North Korea: మరోసారి కిమ్‌ కవ్వింపు చర్యలు..  రెండు బాలిస్టిక్‌ క్షిపణులు ప్రయోగం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

North Korea: కిమ్ జోంగ్ ఉన్‌.. నిరంకుశ పాలనకు పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు క్షిపణి ప్రయోగాలు చేసి పొరుగు దేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. తాజాగా మరోసారి క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా చేపట్టింది. ఉత్తర కొరియా ఆదివారం రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ మరోసారి కవ్వింపు చర్యలను మొదలుపెట్టింది. ప్యోంగ్యాంగ్ గత నెలలో అత్యంత అధునాతన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడంతో సహా అపూర్వమైన ఆయుధ పరీక్షలను నిర్వహించడంతో ఈ సంవత్సరం కొరియా ద్వీపకల్పంలో సైనిక ఉద్రిక్తతలు బాగా పెరిగాయి. ఉత్తర ప్యోంగాన్ ప్రావిన్స్‌లోని టోంగ్‌చాంగ్-రి ప్రాంతం నుంచి ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను గుర్తించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. ఈ క్షిపణులను ఉదయం 11:13 (0213 GMT) నుంచి మధ్యాహ్నం 12:05 గంటల వరకు తూర్పు సముద్రంలోకి ప్రయోగించారని దక్షిణ కొరియాతో పాటు జపాన్‌ ధ్రువీకరించింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ తెలిపారు. మరోవైపు.. జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా సైతం దీనిని ధ్రువీకరించారు. ఈ క్రమంలో జపాన్‌ ప్రధాని ఎమర్జెన్సీ అలర్ట్‌ ప్రకటించారు.

ఈ క్షిపణులు దాదాపు 500 కిలోమీటర్లు ప్రయాణించి గరిష్టంగా 550 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నాయని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. టాంగ్‌చాంగ్రిలో ఉత్తరకొరియాకు చెందిన సోహే శాటిలైట్‌ లాంఛింగ్‌ సెంటర్‌ ఉంది. గతంలో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అవసరమైన రాకెట్లు ఇక్కడ పరీక్షించింది. దీనిపై అప్పట్లో ఐరాస మండిపడింది. రాకెట్ల ముసుగులో ఖండాంతర క్షిపణి టెక్నాలజీని పరీక్షిస్తోందని ఆరోపించింది. గురువారం ఇక్కడ అత్యంత శక్తిమంతమైన ఘన ఇంధన మోటార్‌ను ఉత్తరకొరియా ఇదే కేంద్రంలో పరీక్షించింది. దీనిని తమ వ్యూహాత్మక ఆయుధంలో ఉపయోగిస్తామని ఉత్తర కొరియా చెబుతోంది. అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు ప్రతిగానే తాము క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఉత్తరకొరియా సమర్థించుకొంటోంది.

Also Read

  • KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
  • Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
  • GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్‌కే పరిమితమైన PBKS..
  • Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్‌పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..

Terror Attack: పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి.. నలుగురు పోలీసులు మృతి

కొరియన్‌ ద్వీపకల్పం, జపాన్‌ మధ్యలోని సముద్ర జలాల్లో ఈ మిస్సైల్‌ పడినట్లు జపాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, జపాన్‌ తీరానికి ఎంత దూరంలో పడిందనే విషయాన్ని వెల్లడించలేదు. మరోవైపు.. జపాన్‌ ఎక్స్‌క్లూసివ్‌ ఎకనామిక్‌ జోన్‌కు వెలుపల పడినట్లు ఆ దేశ జాతీయ టెలివిజన్‌ పేర్కొంది. అమెరికాను చేరుకునేంత అత్యాధునిక ఖండాంతర బాలిస్టిక్‌ మిసైల్ పరీక్షలను నిర్వహించబోతున్నమని ఉత్తర కొరియా ప్రకటించిన మూడో రోజే ఈ ప్రయోగం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణుశక్తిని కలిగి ఉండాలని తాను కోరుకుంటున్నట్లు కిమ్ ఈ సంవత్సరం చెప్పాడు. తన దేశాన్ని తిరుగులేని అణు రాజ్యంగా ప్రకటించాడు. కిమ్ గత సంవత్సరం వెల్లడించిన కోరికల జాబితాలో భూమి లేదా జలాంతర్గాముల నుండి ప్రయోగించగల ఘన-ఇంధన ఐసీబీఎంలు ఉన్నాయి. తాజా మోటారు పరీక్ష ఆ లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ.. ఇలాంటి క్షిపణిని అభివృద్ధి చేయడంలో ఉత్తర కొరియా ఎంతవరకు ముందుకు వచ్చిందనేది స్పష్టంగా తెలియరాలేదని విశ్లేషకులు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ballistic Missiles
  • Japan
  • Kim Jong Un
  • Missiles
  • North Korea

తాజావార్తలు

  • Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?

  • Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!

  • KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?

  • Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?

  • Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions