North Korea: రెచ్చిపోయిన ఉత్తర కొరియా.. గజగజ వణుకుతున్న పొరుగు దేశాలు!
- సముద్రంపైకి బాలిస్టిక్ క్షిపణుల వర్షం
- అమెరికా, జపాన్ హెచ్చరికలను తుంగలో తొక్కిన నార్త్ కొరియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: కొరియా ద్వీపకల్పంలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. అంతర్జాతీయ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా ఆదివారం ఉదయం వరుస బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి మరోసారి అలజడి సృష్టించింది. ఈ ఏడాది ఆ దేశం జరుపుతున్న ఆయుధ పరీక్షల్లో ఇది తాజాది కావడం గమనార్హం. తూర్పు ఉత్తర కొరియాలోని సిన్పో తీర ప్రాంతం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (JCS) ధృవీకరించింది. ఈ ప్రయోగాలు ఉత్తర కొరియా తూర్పు తీరానికి సమీపంలోని సముద్రంలో పడి ఉంటాయని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఏడాది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ఇది నాలుగోసారి.
READ ALSO: Peddi : ఏంది ‘పెద్ది’ ఇది.. ఇలా అయితే ఎలా?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అత్యవసర సమావేశానికి దక్షిణ కొరియా నిర్ణయం
ఉత్తర కొరియా కదలికలతో దక్షిణ కొరియా అప్రమత్తమైంది. తమ నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేశామని, అమెరికా – జపాన్‌లతో నిరంతరం సమాచారాన్ని పంచుకుంటున్నామని దక్షిణ కొరియా రక్షణ దళాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితిపై చర్చించడానికి దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం ‘జాతీయ భద్రతా మండలి’ (NSC) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో ఉత్తర కొరియా చర్యలపై జపాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ క్షిపణి పరీక్షలు ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి తీవ్ర ముప్పు కలిగిస్తాయని జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా బాలిస్టిక్ కార్యకలాపాలను నిషేధించే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ప్యాంగ్‌యాంగ్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని మండిపడింది.
గత వారం ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా ఒక డిస్ట్రాయర్ (యుద్ధ నౌక) నుంచి జరిగిన క్షిపణి పరీక్షను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అణ్వస్త్రాలను “భారీగా విస్తరించడం” పై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ప్రకటించారు. అణుదాడి సామర్థ్యాలను మెరుగుపరచడానికి సైన్యానికి కొత్త లక్ష్యాలను కూడా నిర్దేశించారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ గత వారం మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ఉత్తర కొరియాలోని అణు కేంద్రాలలో కార్యకలాపాలు గణనీయంగా పెరిగినట్లు తమ సంస్థ ధృవీకరించిందని ఆయన వెల్లడించారు. వరుస క్షిపణి ప్రయోగాలు, అణు సామర్థ్యాల పెంపుపై కిమ్ జోంగ్ ఉన్ ప్రకటనలు చూస్తుంటే.. రాబోయే రోజుల్లో తూర్పు ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Miss India 2026 Winner: మతి పోగొట్టేసిన మిస్ ఇండియా.. గోవా సుందరి సాధ్విని వరించిన కిరీటం!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..