Peddi : ఏంది ‘పెద్ది’ ఇది.. ఇలా అయితే ఎలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ది చిత్రం గురించి జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. జూన్‌కి వాయిదా పడింది. కానీ, డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు మేకర్స్. దీంతో పెద్ది రిలీజ్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. స్పెషల్ సాంగ్‌తో పాటు ప్యాచ్ వర్క్ పెండింగ్‌లో ఉంది. దానికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవుతోంది. అసలు.. పెద్ది పోస్ట్‌పోన్‌కు మెయిన్ రీజన్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు.. రీ షూట్ చేస్తున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది.
Also Read : Balayya : బాలయ్య–కొరటాల కాంబోపై క్రేజీ బజ్.. మాస్ విధ్వంసమే
Also Read
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
ఇలా ఒకటి కాదు.. పెద్ది గురించి ఏదో ఒక పుకారు షికారు చేస్తునే ఉంది. దీంతో.. పెద్ది జూన్‌లో కూడా రావడం కష్టమనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, మేకర్స్ పెద్ది కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తే ఇంత రచ్చ జరిగేది కాదు. కానీ, అలా జరగలేదు. ఇప్పటికే రెండు సార్లు పోస్ట్‌పోన్ అయిన ఈ సినిమా.. మరోసారి వాయిదా పడకూడదనే ఉద్దేశ్యంతో.. ఈసారి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు మేకర్స్. సరైన అవుట్ పుట్ వచ్చి.. ఆల్ సెట్ అనుకున్నప్పుడే డేట్ ప్రకటించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయినా కూడా పుకార్లు మాత్రం ఆగడం లేదు. నిజం చెప్పాలంటే.. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర యూనిట్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ది ఎప్పుడొచ్చిన బాక్సాఫీస్ బద్దలవుతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అలాగే ఉంది. కాబట్టి.. పెద్ది లేట్ అయినా పర్లేదనే కామెంట్స్ అభిమానుల నుంచి వస్తున్నాయి. అయితే, ఈ సినిమాను జూన్ 4 లేదా 25న రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!