Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story No Sale Of Petrol In Bottles In Andhra Pradesh Election Commission Order

AP Violence: బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దు: ఈసీ

Published Date :May 18, 2024 , 8:38 pm
By Mahesh Jakki
AP Violence: బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దు: ఈసీ
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

AP Violence: ఏపీలో ఎన్నికల సమయంలో, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని పెట్రోల్ బంక్ నిర్వాహకులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయిల్ బంకుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని బంకుల యజమానులకు నోటీసులు పంపింది. పోలింగ్ తర్వాత ఏపీలో పలుచోట్ల హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.

Read Also: Human Trafficking: ఉద్యోగాల పేరుతో మాయ.. ఏపీ, పశ్చిమ బెంగాల్‌ నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్

Also Read

  • Shakti Kapoor: తన మరణవార్తలపై వస్తున్న వార్తలకు శక్తి కపూర్ పవర్ ఫుల్ కౌంటర్!
  • CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
  • Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
  • What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Add as a preferred
source on google

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, జమ్మలమడుగు, తిరుపతి, తదితర ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు రాళ్లు, రాడ్డు, కర్రలు, కత్తులు, పెట్రోల్ బాంబులతో దాడుల చేసుకున్నారు. ఈ దాడుల్లో చాలా మంది గాయాలపాలయ్యారు. అయితే ఈ ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించింది. పలువురు అధికారులను బదిలీ చేసింది. మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ఇదిలా ఉండగా.. ఏపీలో ఎన్నికల తరవాత కూడా పరిస్ధితులు తీవ్రస్థాయిలో ఉన్నాయి. పెట్రోలు బంకుల్లో పని చేసేవాళ్ళు పెట్రోలు పోయాలంటే భయపడుతున్నారు.. బాటిల్ తీసుకొస్తే పెట్రోలు పోయవద్దని పోలీసులు నోటీసులు ఇస్తే.. బ్లేడు బ్యాచ్‌లు మాత్రం రాత్రికి వచ్చి తగులబెడతాం అంటున్నారు. బెజవాడలో పెట్రోల్ బంకుల సిబ్బందికి, యజమానులకు కంటికి కునుకు లేకుండా చేస్తున్నారు. పెట్రోల్‌ బంకుల్లోని సిబ్బంది భయాందోళనలో ఉన్నారు. రాత్రిపూట రక్షణ కల్పించాలని బంకు యజమానులు కోరుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap news
  • AP Violence
  • diesel
  • election commission

తాజావార్తలు

  • Shakti Kapoor: తన మరణవార్తలపై వస్తున్న వార్తలకు శక్తి కపూర్ పవర్ ఫుల్ కౌంటర్!

  • Dragon : గ్లిమ్స్ కోసం మూడు రోజులుగా వర్క్ చేస్తున్న రవి బస్రూర్

  • Kareena-Nayanthara: నయనతార యాక్టింగ్ పై.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

  • CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!

  • Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions