Supreme Court: నీటి విషయంలో “రాజకీయాలు వద్దు”.. విడుదల చేయాలని సుప్రీం ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్నడూ లేనంతగా 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలో.. రాజధాని ప్రజలు అటు ఎండలతో పాటు, నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో.. ఢిల్లీ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని నీరు కావాలని కోరగా.. సుముఖత చూపించింది. దీంతో.. సుప్రీంకోర్టు కూడా, ఢిల్లీకి 137 క్యూసెక్కుల అదనపు నీటిని విడుదల చేయాలని.. ఆదేశించింది. హిమాచల్ నుండి ఢిల్లీకి నీటిని సులభతరం చేయాలని హర్యానాను కోరింది.
Read Also: Oman Vs Australia: బోణి కొట్టిన ఆసీస్.. ఒమన్ పై భారీ విజయం..
Also Read
హిమాచల్ నుంచి అందుతున్న నీటిని ఢిల్లీలోని వజీరాబాద్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా చేరేలా హర్యానా ప్రభుత్వం అనుమతించాలని, తద్వారా ఢిల్లీ ప్రజలకు తాగునీరు అందుతుందని కోర్టు పేర్కొంది. జస్టిస్ ప్రశాంత్ కె మిశ్రా, కెవి విశ్వనాథన్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ హిమాచల్ అదనపు నీటిని సరఫరా చేయడానికి అంగీకరించిందని తెలిపింది. మరోవైపు.. నీటి విషయంలో రాజకీయాలు ఉండకూడదని, నీటిని విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశం ఇచ్చింది. “భారీ ఎండ తీవ్రత దృష్ట్యా.. ఢిల్లీ తాగునీటికి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. హర్యానాలో కూడా తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ, నీటి కొరత లేదు” అని కోర్టు తెలిపింది. ఈ క్రమంలో నీరు వృథా కాకుండా చూసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Read Also: Kurnool District: కర్నూలు జిల్లాలో జోరుగా వజ్రాల వేట
గత నెల రోజులుగా వాయువ్య ప్రాంతంలో తీవ్రమైన వేడిగాలులు వీచడంతో ఢిల్లీ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. నగరంలో ఉష్ణోగ్రతలు 40-50 డిగ్రీల పరిధిలో నమోదయ్యాయి. రాజధాని నగరంలో వడదెబ్బ కారణంగా ఒకరు మరణించారు. ఇదిలా ఉంటే.. హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుండి ఒక నెల పాటు అదనపు నీటి సరఫరా చేయాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం గత నెలలో కేంద్రం మరియు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో.. మండుతున్న ఎండలలో ఢిల్లీకి నీటి అవసరం పెరిగిందని, దేశ రాజధాని అవసరాలను తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిటిషన్‌లో పేర్కొంది.
తాజావార్తలు
-
Astrology: జూన్ 27 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Astrology: ఈ 3 రాశులవారు ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడతారా? జ్యోతిష్యం ఏమి చెబుతోంది?
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!