Minister Payyavula Keshav: జూనియర్ ఎన్టీఆర్ గురించి నేను ఎక్కడా అనలేదని ఒకసారి ఎమ్మెల్యే చెప్పిన తర్వాత ఆ అంశంపై ఇంకా వివాదం కొనసాగించడం భావ్యం కాదని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం త్వరలో GST లో సామాన్యుడికి న్యాయం జరిగేలా రిఫార్మ్స్ తీసుకురాబోతుందని, దానికి మేము సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ రిఫార్మ్స్ వల్ల రాష్ట్రాలకు ఆర్థిక భారం పడే అవకాశమున్నా, మేము పూర్తిగా సహకరిస్తామన్నారు. గత పాలకులు చేసిన అప్పులకు వడ్డీలు కట్టాల్సి వస్తోందని, అందువల్లే కొత్త అప్పులు చేయాల్సి వస్తోందని వివరించారు.
New Bars Tenders: ప్రశ్నార్థకంగా మారిన కొత్త బార్ పాలసీ.. 840 బార్లకు కేవలం 90 అప్లికేషన్లు మాత్రమే!
పోలవరాన్ని, అమరావతిని, ఇరిగేషన్ ప్రాజెక్టులను, నేషనల్ హైవేలు, మెట్రోలు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని చెప్పారు. పెన్షన్ల విషయంలో చాలా క్లియర్‌గా చెప్పామని, కేవలం నోటీసులు మాత్రమే ఇస్తామని, ఆ నోటీసులను మెడికల్ బోర్డుతో నిరూపించుకోవాల్సి ఉంటుందని వివరించారు. యూరియా ఎక్కడైనా అక్రమ రవాణా జరిగితే వెంటనే విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతిపక్షాల ఆరోపణలు అబద్ధమని, గతం కంటే ఎక్కువ యూరియా ఇచ్చామని స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
iPhone 16 Price Drop: 35 వేలకే ‘ఐఫోన్ 16’.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు భయ్యో!
అంతేకాకుండా, కేవలం మూడు నెలల్లో 35 కోట్లు ఖర్చు చేసి HLC పనులు పూర్తి చేశామని తెలిపారు. ఉచిత బస్సు సేవలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయని.. అనంతపురంలో “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” కార్యక్రమం ఏర్పాటు చేసుకోబోతున్నామని అన్నారు.