Hardeep Singh Puri: “ఇది బాధ్యతారాహిత్యం”.. భారత్‌లో లాక్డౌన్ పుకార్లపై కేంద్ర మంత్రి క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardeep Singh Puri: మధ్యప్రాచ్య సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో జనాలు ఒక్కసారిగా పానిక్ అవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్లో వివరించారు. కరోనా సంక్షోభం నాటి పరిస్థితులకు ప్రజలకు సిద్ధంగా ఉండాలని మోడీ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ప్రజల్లో మరోసారి కలవరం మొదలైంది. ప్రధాని వ్యాఖ్యల అనంతరం లాడ్ డౌన్ వంటి పరిస్థితులు వస్తాయనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ అంశంపై తాజాగా పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ పూరి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 తరహా దేశవ్యాప్త లాక్డౌన్ విధించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, ఆ వదంతులు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. పుకార్లను వ్యాపింపజేయడం, భయాందోళనలను సృష్టించడం బాధ్యతారాహిత్యమన్నారు.
READ MORE: Rohit Sharma: “ఓరి దేవుడా.. రోహిత్, గుర్తుపట్టలేకపోయాను”.. హిట్‌మ్యాన్‌ను చూసి అందరూ షాక్
Also Read
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- ENG vs SL: హడలెత్తించిన 'హ్యారీ బ్రూక్' సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
“భారతదేశంలో లాక్డౌన్ విధిస్తారన్న వదంతులు పూర్తిగా అవాస్తవం. ప్రపంచ పరిస్థితులు ఎప్పటి కప్పుడు మార్పునకు లోనవుతున్నాయి. ఇంధనం, సరఫరా గొలుసులు (supply chains), నిత్యావసర వస్తువులకు సంబంధించి జరుగుతున్న పరిణామాలను మేము నిశితంగా గమనిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మన పౌరులకు ఇంధనం, శక్తి, ఇతర కీలక వస్తువుల సరఫరా నిరంతరాయంగా అందేలా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ సమయంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి పూర్తి సిద్ధంగా ఉన్నాం. ప్రపంచ అనిశ్చితుల మధ్య కూడా భారతదేశం నిలకడను (resilience) చాటుకుంటూ వస్తోంది. మేము సమయానుకూలంగా, ముందస్తుగా, సమన్వయంతో కూడిన చర్యలను కొనసాగిస్తాం. భారతదేశంలో లాక్డౌన్ విధిస్తారనే వార్తలు పూర్తిగా అబద్ధం. నేను దీనిని స్పష్టంగా చెపుతున్నాను, భారత ప్రభుత్వం వద్ద అటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు. ఇలాంటి సమయాల్లో మనం ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండటం ముఖ్యం. ఇటువంటి పరిస్థితుల్లో పుకార్లను వ్యాపింపజేయడం, భయాందోళనలను సృష్టించడం బాధ్యతారాహిత్యం, హానికరం.” అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
The global situation remains in flux, and we are closely monitoring developments across energy, supply chains, and essential commodities on a real-time basis.
Under the leadership of Hon’ble PM @narendramodi Ji, all necessary steps are being taken to ensure uninterrupted…
— Hardeep Singh Puri (@HardeepSPuri) March 27, 2026
తాజావార్తలు
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!