Vivek Sinha: “పాకిస్థానీయులు ప్రేమిస్తున్నారు.. భారతీయులు చంపేస్తామంటున్నారు”.. ధురంధర్ నటుడు షాకింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivek Sinha: ధురంధర్: ది రివెంజ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ధురందర్ చిత్రంలో నటుడు వివేక్ సిన్హా నటనకు విస్తృత ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాలో ఆయన పాత్ర చిన్నదే అయినా నటన మాత్రం అద్భుతంగా ఉంది. స్క్రీన్‌పై కొంతసేపే కనిపించినా నటనతో అందరినీ ఆకట్టుకోగలిగారు. వివేక్ ఈ చిత్రంలో జహూర్ మిస్త్రీ పాత్రను పోషించారు. వివేక్ చెప్పిన “హిందువులు పిరికి జాతి” అనే డైలాగ్ వైరల్ అయింది. ఈ సినిమాలో పాకిస్థాన్ ఉగ్రవాది పాత్రలో వివేక్ నటించాడు. అయితే.. ఈ సినిమా చూసిన చాలా మంది పాకిస్థానీలు అభిమానులగా మారారట. అక్కడి నుంచి సందేశాలు వస్తున్నాయట. తాజాగా జీ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వివేక్ తన పాత్రపై సోషల్ మీడియాలో వస్తున్న స్పందన గురించి మాట్లాడాడు. “నా పోస్ట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2000 కామెంట్లు వచ్చాయి. వాటిని నేను ఆస్వాదిస్తున్నాను. నన్ను చూసి ప్రజలకు కోపం వస్తోంది. వారు తెరలోకి ప్రవేశించి నన్ను చంపాలనుకుంటున్నారు. కొంత మంది నా నటనను మెచ్చుకుంటున్నారు. నేను సహజంగానే నటించాను. కొంత మంది నా మీద ఎంత కోపంగా ఉన్నారంటే పాకిస్థాన్‌కు వచ్చి నిన్ను చంపేస్తామని మెసేజ్‌లు చేస్తున్నారు. నేను పాకిస్థానీని కాదని, భారతీయుడిని అని వాళ్లకు స్పష్టం చేయాల్సి వచ్చింది. అంతే కాదు.. సినిమాలో నా పాత్రను చూసిన కొంత మంది పాకిస్థానీయుల నుంచి నాకు సందేశాలు వస్తున్నాయి. “సర్, పాకిస్థాన్ నుంచి మిమ్మల్ని ప్రేమిస్తున్నాం” అని మెసేజ్‌లు వస్తున్నాయి.” అని వివేక్ వివరించాడు.
READ MORE: Gold and Silver Price Today: పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధర..
Also Read
ఇక ఈ సినిమాతో వివేక్ సైతం ఒక స్టార్ అయ్యాడు. కానీ ఇంత దూరం రావడానికి జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. ఆరేళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన వివేక్‌ను అతని తల్లి అన్నీ తానై పెంచింది. అతనికి ఎప్పుడూ ఏ లోటూ లేకుండా చూసింది. నటుడు కావాలని అతను ఎప్పుడూ అనుకోలేదట. చదువు పూర్తి చేశాక పని దొరికిన పని చేశాడు. ఎవరో అతడికి నటన గురించి సలహా ఇచ్చారు. దీంతో చిన్న చిన్న పాత్రలు చేయడం ప్రారంభించాడు. వివేక్ నటనకు ప్రశంసలు లభించడంతో యాక్టింగ్‌లోనే కొనసాగాడు. ఇప్పుడు, ‘ధురందర్’ సినిమాతో క్రేజ్ సంపాధించుకున్నాడు. ఈ ఒక్క సినిమాతో వివేక్ జీవితం పూర్తిగా మారిపోయింది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!