భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లే వచ్చి కనుమరుగైంది. తటస్థ వేదికపై టెస్ట్ సిరీస్ నిర్వహించే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ( పీసీబీ ) ప్రతిపాదనను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ( బీసీసీఐ ) కొట్టిపారేసింది. సమీప భవిష్యత్తులో కూడా భరాత్-పాకిస్తాన్ సిరీస్ జరిగే అవకాశం లేదని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. పీసీబీ అధ్యక్షుడు నజమ్ సేథి సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ ను ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ లేదా సౌతాఫ్రికాల్లో జరిపితే బాగుంటుందని ప్రతిపాదించిన అనంతరం బీసీసీఐ పై విధంగా రియాక్ట్ అయింది.
Also Read : Karnataka Politics: కర్ణాటక సీఎంగా సిద్దరామయ్యే ఎందుకు..? డీకే ఎలా పట్టు నిలుపుకోనున్నారు..?
2007 డిసెంబర్‌లో భారత్-పాక్‌ల మధ్య టెస్ట్ మ్యాచ్ చివరిసారిగా జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఆసియా కప్-2023 వేదిక విషయంలో ప్రస్తుతం భారత్-పాక్‌ల మధ్య ఏకాభిప్రాయం మాత్రం కుదరడం లేదు. భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాకిస్తాన్ లో అడుగుపెట్టదని ఇప్పటికే బీసీసీఐ తెగేసి చెప్పగా.. దీనికి కౌంటర్‌గా పాకిస్తాన్ కూడా వన్డే వరల్డ్‌కప్ కోసం భారత్‌లో అడుగుపెట్టదని పీసీబీ చీఫ్ నజమ్ సేథి స్పష్టం చేశాడు. ఆసియాకప్ మ్యాచ్‌లను భారత్ తటస్థ వేదికలపై ఆడాలనుకుంటే, వరల్డ్‌కప్‌లో తమ మ్యాచ్‌లను కూడా తటస్థ వేదికలపై నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలో ఆసియాకప్, వరల్డ్‌కప్ నిర్వహణపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది.
Also Read : Lubna Ameer: పోర్న్ వీడియోలు చేస్తుంది.. నటిపై ప్రియుడు సంచలన ఆరోపణలు
అయితే పాకిస్థాన్ వన్డే వరల్డ్ కప్ లో తమ జట్టు ఆడేందుకు తటస్థ వేదికలను సిద్ధం చేయాలని చెప్పడంతో ఇంటర్నెషన్ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ ) ఆగ్రహం వ్యక్తం చేసింది. లిస్ట్ లో ఉన్న పది జట్లు తప్పకుండా తాము నిర్ణయించిన వేదికల్లోనే మ్యాచ్ లను ఆడాలని ఐసీసీ సూచించింది. టోర్నీ నుంచి తప్పుకోవాలని చూస్తే భారీ జరిమాన విధించే అవకాశం ఉన్నట్లు ఐసీసీ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. సుమారు 5 వేల కోట్ల వరకు జరిమానా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.