మలయాళ చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కథలతో మెప్పించే నివిన్ పౌలీ తాజాగా ఒక ఆసక్తికరమైన హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే ‘సర్వం మాయ’. అఖిల్ సత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, భావోద్వేగాలతో అందరి మనసులను గెలుచుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
Also Read : Pawan Kalyan, Bhumika : పవన్ కల్యాణ్ పై భూమిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఈ శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జియో హాట్‌స్టార్ (JioHotstar) వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కథాంశం చాలా వెరైటీగా ఉంటుంది. “ఇది మోడల్ దెయ్యం.. మిమ్మల్ని భయపెట్టదు, ఒక మూలన కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉంటుంది” అంటూ నివిన్ పౌలీ చేసే కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. దేవుడికి దూరంగా, దెయ్యానికి దగ్గరగా ఉండే ఒక వ్యక్తి ప్రయాణమే ఈ చిత్రం. ఇందులో నివిన్ పౌలీతో పాటు అజు వర్గీస్, రియా శిబు, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటించారు. మలయాళం సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ హారర్ కామెడీ ఒక మంచి వినోదాన్ని పంచుతుందనడంలో సందేహం లేదు.హారర్.. కామెడీ అంశాలను సమపాళ్లలో కలిపి, ఒక కొత్త తరహా అనుభూతిని ఇచ్చే ‘సర్వం మాయ’ చిత్రాన్ని ఈ వీకెండ్‌లో మీ ఇళ్లలోనే ఎంజాయ్ చేయొచ్చు.