NTV Telugu Site icon

Nitish Kumar Reddy: పవన్ కళ్యాణ్.. “నారాజు గాకుర మా అన్నయా…” పాట పాడిన నితీష్ రెడ్డి(వీడియో)

Nitish Kumar Reddy

Nitish Kumar Reddy

ఆస్ట్రేలియా గడ్డపై తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఆస్ట్రేలియా-ఇండియా జట్ల మధ్య మెల్‌బోర్న్ లో నాల్గవ టెస్టు మ్యా్చ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. 8వ నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఎనిమిదో నంబర్‌లో సెంచరీ సాధించిన రెండవ భారతీయ క్రికెటర్ గా నిలిచాడు. కాగా ఆసీస్ ను వారి సొంత గడ్డపైనే దడదడలాడించిన నితీశ్ రెడ్డిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

READ MORE: SA vs PAK: పాకిస్తాన్ పై గెలుపుతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న దక్షిణాఫ్రికా

ఇదిలా ఉండగా.. నితీష్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నితీష్ పవన్ కళ్యాణ్ నటించిన “జానీ” సినిమాలోని “నారాజు గాకుర మా అన్నయా…” పాట పాడటం కనిపిస్తోంది. వాస్తవానికి నితీష్ సన్ రైజర్స్ హైదరాబాద్‌ టీంలో ఉన్నప్పుడు ఈ పాట పాడినట్లు తెలుస్తోంది. కాగా.. సెంచరీ సాధించిన నేపథ్యంలో మన తెలుగు స్టార్ క్రికెటర్‌ని గుర్తు చేసుకుంటూ.. ఈ పాట పాడిన నితీష్ వీడియోను వైరల్ చేస్తున్నారు.

READ MORE: Goa Liquor: గోవా నుంచి మద్యం తెస్తున్నారా? ఎక్సైజ్ పోలీసులు ఏం చేశారో చూడండి..

మరోవైపు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మీరు ‘భారత్‌’ లోని ఏ ప్రాంతం నుంచి వచ్చారన్నది కాదు.. దేశం గర్వించేలా ఏం చేశారన్నది ముఖ్యం. ప్రియమైన ‘నితీష్ కుమార్ రెడ్డి’ ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన భారత్‌ నుంచి అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించినందుకు.. ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) యొక్క కీలకమైన నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో 114 పరుగులతో అద్భుతమైన నాక్‌తో మీ ప్రతిభను ప్రదర్శించారు.’ అని పవన్ కల్యాణ్ తెలిపారు. ‘మరెన్నో ప్రపంచ స్థాయి రికార్డులను సాధించడం కొనసాగించండి, భారత్ జెండాను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లండి. యువతకు క్రీడల పట్ల అభిరుచి మరియు దృఢ సంకల్పంతో ఆసక్తిని పెంపొందించేలా స్ఫూర్తినివ్వండి. ఈ సిరీస్‌లో భారత్‌ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.’ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Show comments