గోవా నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి వాస్కోడిగామా రైల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. 43 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. గోవా వస్తున్న వాస్కోడిగామా రైల్లో మద్యం తీసుకు వస్తున్నారని సమాచారం అందింది. ఈ మేరకు ఏఈ ఎస్ జీవన్ కిరణ్, ఎస్ టి ఎఫ్, డిటిఎఫ్ సీఐలు సుభాష్ చందర్, బాలరాజు, ఎస్సైలు వెంకటేష్, రవిలతో పాటు 20 మంది సిబ్బంది శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు తనిఖీలు నిర్వహించారు. పలువురు వద్ద ఉన్న 43 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ. రెండు లక్షల మేరా ఉంటుందని అంచనా వేశారు. మద్యం బాటిల్లను పట్టుకున్నటువంటి ఎక్సైజ్ టీమ్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ అభినందించారు.
READ MORE: Parents Sell Baby: బైక్ కొనేందుకు.. 9 రోజుల నవజాత శిశువును అమ్మిన తల్లిదండ్రులు