ఆస్ట్రేలియా గడ్డపై తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఆస్ట్రేలియా-ఇండియా జట్ల మధ్య మెల్‌బోర్న్ లో నాల్గవ టెస్టు మ్యా్చ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. 8వ నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఎనిమిదో నంబర్‌లో సెంచరీ సాధించిన రెండవ భారతీయ క్రికెటర్ గా నిలిచాడు. కాగా ఆసీస్ ను వారి సొంత గడ్డపైనే దడదడలాడించిన నితీశ్ రెడ్డిపై…