Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Nitish Kumar Rajya Sabha Son Nishant Kumar Jdu Entry Bihar Deputy Cm

Nishant Kumar: జేడీయూ వారసుడికి పట్టాభిషేకం రేపేనా? బీహార్ డిప్యూటీ సీఎంగా నిశాంత్ కుమారుడు!

Published Date :March 6, 2026 , 9:38 pm
By Shiva Ganesh
Nishant Kumar: జేడీయూ వారసుడికి పట్టాభిషేకం రేపేనా? బీహార్ డిప్యూటీ సీఎంగా నిశాంత్ కుమారుడు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nishant Kumar: బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. జనతాదళ్ (యునైటెడ్) అధినేత, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో వారసుడిగా తన కుమారుడు నిశాంత్ కుమార్‌ను రాజకీయ క్షేత్రంలోకి దింపారు. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసంలో జరిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కీలక సమావేశంలో రెండు ప్రధాన నిర్ణయాలకు ఏకగ్రీవ ఆమోదం లభించినట్లు సమాచారం. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి స్వస్తి పలికి, రాజ్యసభకు వెళ్లాలనే ప్రతిపాదనను పార్టీ సభ్యులు ఆమోదించారు. అలాగే నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ అధికారికంగా జేడీయూలో చేరడం కూడా ఖరారు అయ్యింది.

READ ALSO: AI Effect: ఏఐతో ఉద్యోగాలు కోల్పోయే 10 రంగాలు ఇవే.. జాబితా వెల్లడించిన ఆంత్రోపిక్..

Also Read

  • RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
  • OnePlus Realme Merger: విలీనం కానున్న వన్‌ప్లస్, రియల్‌మీ..!?
  • Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..

నిశాంత్ కుమార్ రాజకీయ ప్రస్థానం..
బిఐటి మెస్రా నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిశాంత్ కుమార్, ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారు. అయితే, ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. నిశాంత్ కుమార్ శనివారం అధికారికంగా జేడీయూ తీర్థం పుచ్చుకోనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. కొత్త ప్రభుత్వంలో నిశాంత్ కుమార్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. పార్టీ ఓటు బ్యాంకును (కుర్మి-కోరి) కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. పార్టీలో చేరిన వెంటనే నిశాంత్ కుమార్ బీహార్ అంతటా పర్యటించి ప్రజలతో మమేకం కానున్నారని చెబుతున్నారు.

నితీష్ కుమార్ తప్పుకోవడంతో బీహార్‌లో ఎన్డీయే (NDA) కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నితీష్ కుమార్ స్థానంలో బీజేపీకి చెందిన ఒక నాయకుడు (బహుశా బీసీ లేదా ఈబీసీ వర్గానికి చెందిన వ్యక్తి) ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై నితీష్ కుమార్ ఢిల్లీ వేదికగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. రేపు జరగబోయే అధికారిక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు అగ్రనేతలు హాజరుకానున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేల సమావేశంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. “నేను రాజ్యసభకు వెళ్తున్నాను, కానీ మేము బీహార్‌లోనే ఉంటాము. అభివృద్ధి పనులన్నీ కొనసాగుతాయి, మీ అందరినీ నేను జాగ్రత్తగా చూసుకుంటాను” అని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా పలువురు నేతలు కన్నీటి పర్యంతమయ్యారని చెబుతున్నారు.

READ ALSO: Hardik Pandya: గంభీర్‌కు గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bihar NDA new government 2026
  • Bihar Next Chief Minister BJP
  • BIT Mesra software engineer Nishant Kumar
  • JDU succession plan Nishant Kumar
  • Nishant Kumar Deputy CM

తాజావార్తలు

  • RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు

  • Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions