Nandamuri Tarakaratna : తారకరత్న కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్.. కుందనపు బొమ్మలా ఎంత బాగుందో !
Nandamuri Tarakaratna : నందమూరి తారకరత్న ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన పేరు వినగానే కన్నీళ్లు ఉబికి వచ్చేస్తాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ, 39ఏళ్లకే హర్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. తన నటనతో హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. నందమూరి ఫ్యామిలి నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. తారకరత్న 2001లో ఏకంగా 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. 2002లో విడుదలైన ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఎంట్రీ .. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Also Read
- 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
- Fuel Shortage: పెట్రోల్ బంక్‌లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ఆయన అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకుని పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కూడా సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అభిమాలను పలకరిస్తుంటారు. అప్పుడప్పుడు కుటుంబ విషయాలను పంచుకుంటారు. ఎక్కువగా పిల్లలకు సంబంధించిన విషయాలు షేర్ చేస్తుంటారు. తాజాగా అలేఖ్య కుమార్తెకు సంబంధించి ఇన్ స్టా వేదికగా మరో శుభవార్త పంచుకున్నారు. ఈ రోజు తన పెద్ద కుమార్తె నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ జరిగిందంటూ అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇన్ స్టాలో షేర్ చేశారు. ప్రాంగణం వద్ద తండ్రి తారకరత్న ఫోటోలను అందంగా డెకరేట్ చేసి నివాళులు అర్పించి కార్యక్రమం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. నిష్క హాఫ్ సారీలో కుందనపు బొమ్మలా కనిపించింది. వేడుక కోసం ఎంతో అందంగా ముస్తాబైంది.
Read Also:Maria Sharapova: రష్యా అందం మరియా షరపోవాకు అరుదైన గౌరవం!
నుదిటిన పాపిడి బొట్టు.. మెడలో బంగారు ఆభరణాలు, నడుముకు వడ్డానం, చెవులకు పెద్ద బుట్టలు, రెండు చేతులకు గాజులు వేసుకుంది. క్రీమ్ కలర్ చీర మ్యాచింగ్ రవికలో నిష్క ఎంతో అందంగా కనిపిస్తుంది. నిష్క అచ్చంగా తన తండ్రి తారకరత్న పోలికలతోనే ఉంది. ఈ కార్యక్రమంలో అలేఖ్య రెడ్డి తరుపు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు అంతా పాల్గొన్నట్లు తెలుస్తుంది. మాజీ ఎంపీ వైసీపీ నేత, విజయసాయి రెడ్డి సతీసమేతంగా పాల్గొని నిష్కని ఆశీర్వదించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిష్మకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. అలేఖ్య రెడ్డి కి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
-
Anil Ravipudi: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
-
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
-
Fuel Shortage: పెట్రోల్ బంక్‌లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!