యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పూర్తి పీరియాడికల్ మైథలాజికల్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ రాజుగా సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండే ప్రేక్షకుల్లో, ముఖ్యంగా నిఖిల్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రం నుండి వినిపిస్తున్న తాజా వార్తలు సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నాయి.
Also Read : Kriti Sanon : బాక్సాఫీస్ నంబర్లు కాదు..పాత్రలే ముఖ్యం
కాగా ఈ సినిమాలోని నిఖిల్ ఎంట్రీ సీన్ గురించిన క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో వైరల్ అవుతోంది. సాధారణంగా హీరోలు డ్యాన్స్‌తోనో లేదా ఫైట్‌తోనో ఎంట్రీ ఇస్తారు, కానీ ‘స్వయంభు’లో నిఖిల్ ఒక భీకరమైన యుద్ధం మధ్యలో ఎంట్రీ ఇస్తారట. ఒక శక్తివంతమైన రాజుగా నిఖిల్ శత్రువుల మీద విరుచుకుపడే ఈ సీక్వెన్స్, విజువల్స్ పరంగా హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందని మేకర్స్ హిట్ ఇస్తున్నారు. ఈ సీన్ కోసం నిఖిల్ కత్తియుద్ధం, గుర్రపు స్వారీ లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు.
ఈ సినిమా విజువల్ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారట. ‘బాహుబలి’, ‘RRR’ చిత్రాలకు పని చేసిన ఆయన విజన్ ఈ మూవీని మరో స్థాయికి తీసుకెళ్లనుంది. ఇక ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం, ముఖ్యంగా నిఖిల్ ఎంట్రీ సీన్ వద్ద ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని తెలుస్తోంది. సంయుక్త మీనన్ మరియు నభా నటేష్ కూడా కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఫిబ్రవరి 13, 2026న పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.