గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ టాక్డ్ హీరోయిన్గా మారింది. గతేడాది పవన్ కళ్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’, ఈ సంక్రాంతికి ప్రభాస్ సరసన ‘ది రాజా సాబ్’ సినిమాలతో క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయని నిధి తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించింది. తనపై ఇండస్ట్రీలో కొందరు పనిగట్టుకుని నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని, తనని తొక్కేయడానికి భారీగా డబ్బులు ఖర్చు చేసి మరీ కుట్రలు పన్నుతున్నారని ఆమె ఆరోపించింది. అలాగే నటీనటులు చాలా ఎమోషనల్‌గా ఉంటారని, ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల వారి కుటుంబాలు కూడా ఎంతో కుంగిపోతాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read : Peddi : ‘పెద్ది’ మాస్ జాతర మొదలైంది.. థియేటర్లు షేక్ అవ్వాల్సిందే!
ఇదే ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్స్ కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్‌లపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూడా నిధి ఖండించింది. వరుణ్ ధావన్ చాలా స్వీట్ అని, కో-స్టార్స్‌ని ఎంతో ఎంకరేజ్ చేస్తాడని చెప్పుకొచ్చింది. అలాగే కార్తీక్ ఆర్యన్ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి వచ్చారని గుర్తు చేసింది. ఇక హైదరాబాద్ మాల్ ఈవెంట్లో తనకు ఎదురైన చేదు అనుభవంపై స్పందిస్తూ.. డ్రెస్సింగ్‌ని తప్పుబట్టడం సరికాదని, బాధితురాలిదే తప్పు అనడం మానిపులేషన్ అని ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కాశీకి వెళ్లి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికంగా తనలో చాలా మార్పు వచ్చిందని, ఇలాంటి ఎన్ని నెగిటివ్ క్యాంపెయిన్లు ఎదురైనా ధైర్యంగా నిలబడతానని నిధి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.