హైదరాబాద్ నగరంలో ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే నగరంలో పలు చోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. నేటి తెల్లవారుజాము నుంచే సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వరవరరావు అల్లుడు వేణుగోపాల్ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో హిమాయత్ నగర్ లోని ఆయన నివాసంలో ఈ రైడ్స్ జరుపుతున్నారు. అలాగే, ఎల్ బీ నగర్ లోని రవి శర్మ ఇంట్లో కూడా ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.