NIA Raids: గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాద ముఠాలకు లింక్.. దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA Raids: గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాద ముఠాలకు మధ్య ఉన్న సంబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మంగళవారం ఎన్ఐఏ అధికారులు దాడులు జరిపారు. జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, దిల్లీ, రాజస్థాన్‌తో పాటు హరియాణాలోని పలువురు గ్యాంగ్‌స్టర్ల స్థలాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. గ్యాంగ్‌స్టర్-టెర్రర్ కేసులో దర్యాప్తులో భాగంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లోని 20 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ-ఎన్‌ఐఐ దాడులు జరిపింది. దేశవ్యతిరేక కార్యకలాపాలకు గ్యాంగ్‌స్టర్లను ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారనే దానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరా తీస్తోంది. ఇప్పటికే యాంటీ టెర్రర్ ఏజెన్సీ నిఘాలో ఉన్న లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానా, టిల్లు తాజ్‌పురియా, గోల్డీ బ్రార్‌లతో సహా ఆరుగురిని దృష్టిలో ఉంచుకుని ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Tammineni Sitaram: సుప్రీం తీర్పు భేష్.. ఆరునెలల్లో ఇల్లే కట్టలేం.. రాజధాని ఎలా కడతాం..?
Also Read
గ్యాంగ్‌స్టర్లను కట్టడి చేసేందుకు ఉత్తర భారతదేశంలోని 50కి పైగా ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు చేస్తోంది. లారెన్స్ బిష్ణోయ్, బవానా గ్యాంగ్ పేరిట భారత్‌లో ఉగ్రదాడులకు భారీగా నిధులు సమకూరుస్తున్నాయని చెప్పారు. అక్టోబర్‌లో నాలుగు రాష్ట్రాలతో పాటు దిల్లీలోని 52 ప్రదేశాలలో ఎన్ఐఏ విస్తృత సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సోదాల్లో ఆసిఫ్ ఖాన్ అనే న్యాయవాదితో పాటు హరియాణాకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్‌ను అధికారులు అరెస్టు చేశారు. ఉస్మాన్పుర్లోని గౌతమ్ విహార్‌కు చెందిన న్యాయవాది ఆసిఫ్ ఖాన్ ఇంట్లో జరిపిన సోదాల్లో నాలుగు ఆయుధాలతో పాటు పలు పిస్టోళ్లను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. న్యాయవాదికి.. జైలులో ఉన్న గ్యాంగ్స్టర్లతో సత్సంబంధాలు ఉన్నట్లు విచారణలో రుజువైంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..