Burnt Alive: కారులో చెలరేగిన మంటలు.. నూతన వధూవరులతో పాటు నలుగురు సజీవదహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Burnt Alive: మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఓ చెట్టును ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణించిన నూతన వధూవరులతో సహా సహా నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. .ఒక కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు పెళ్లికి హాజరై కారులో తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కారు ఒక చెట్టును వేగంగా ఢీకొంది. దీంతో ఆ కారులో మంటలు చెలరేగాయి.
అందులో ఉన్న ఒక మహిళ, ముగ్గురు మగవారు మంటలంటుకున్న కారు నుంచి బయటకు రాలేకపోయారు. దీంతో వారు మంటల్లో కాలిపోయి సజీవ దహనమయ్యారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఫైరింజిన్‌తో సహా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఒక మహిళతోసహా నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.పెళ్లైన కొత్త దంపతులు కూడా మృతుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
Read Also: Man Stabs Daughter: దారుణం.. కన్నకూతురినే 25 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..
ఈ తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. “హర్దా జిల్లాలో కారు వేగంగా చెట్టుపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు పురుషులు, ఒక మహిళ సజీవ దహనమయ్యారు. వారు పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నారు” అని పోలీసు అధికారి తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన జంటకు ఆరు నెలల క్రితమే వివాహమైందని తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
గత వారం మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో స్లీపర్ బస్సు ట్రాలీని ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. అహ్మదాబాద్‌కు వెళుతున్న బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది
తాజావార్తలు
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..