వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
యాదగిరిగుట్టలో కొత్తగా నిర్మించిన సర్కిల్స్‌కు నామకరణం చేశారు. కృష్ణ శిలతో ఆలయం నిర్మించిన సమయములోనే ఈ సర్కిల్స్ (కూడళ్ళు) ఏర్పాటు చేశారు. కానీ వీటికి పేర్లు పెట్టకపోవడముతో భక్తులు తాము ఎక్కడ ఉన్నామో అర్థంకాని స్థితిలో ఉండేది. అలాగే తమ వాళ్ళను కలవడానికి ఇబ్బంది పడ్డారు.
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా టీటీడీ కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ప్రతి రాష్ర్ట రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. స్విమ్స్ హస్పిటల్‌కు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు.