న్యూయర్ రోజు తమకు ఇష్టమైన వారితో సంతోషంగా గడపాలని అందరు అనుకుంటారు.. పాత సంవత్సరాన్ని పంపించి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని చాలా మంది అనుకుంటారు.. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ న్యూఇయర్ సెలబ్రేషన్స్ గట్టిగా చేసుకున్నారు. డిసెంబర్ 31న జరిగిన అమ్మకాలు చూస్తేనే ఏ రేంజ్‌లో వేడుకలు జరిగాయో అర్థమవుతోంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 5.4 లక్షల చికెన్ అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది..
ఎప్పటిలాగానే మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఇక బార్లు, పబ్బులు ప్రజలతో కిటకిటలాడాయి. ఇదిలా ఉంటే కొత్తేడాదికి ఆహ్వానం పలికే సమయంలో బిర్యానీలతో పాటు, కండోమ్స్ అమ్మకాలు సైతం భారీగా పెరిగినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తెలిపింది.. ఇక ఒక్క హైదరాబాద్ లోనే 4.8 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సమయంలో వచ్చిన ఆర్డర్ల కంటే 1.6 రెట్లు ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు తెలుస్తుంది..
ప్రతీ నిమిషానికి 1244 ఆర్డర్లు వచ్చాయి. చివరి గంటలో సుమారుగా 10 లక్షల మంది స్విగ్గీ యాప్‌ను ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. న్యూఇయర్ వేడుకల సమయంలో ప్రతి గంటకు 1,722 యూనిట్ల కండోమ్స్ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గి ఇంస్టామర్ట్ సోషల్ మీడియా వేధికగా తెలిపింది.. జొమాటోలో కూడా భారీగా ఆర్డర్లు వచ్చాయని ఆ కంపెనీ తెలిపింది. దాదాపు 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్ ఇయర్ ఎండ్‌లో సేవలు అందించారని తెలిపింది.. పిజ్జాలు కూడా ఎక్కువగా ఆర్డర్ వచ్చినట్లు తెలిపింది..
Condoms ordered peaked at 1722 condoms per hour ordered in the morning.
We just hope you are DUR from your EX 🤭— Swiggy Instamart (@SwiggyInstamart) December 31, 2023