Akhanda 2 Thandavam : ఆ సినిమాలో బాలయ్య ఎంట్రీ సీన్ కోసం భారీ బడ్జెట్ తో స్పెషల్ సెట్
- అంచనాలను పెంచేస్తోన్న అఖండ 2 తాండవం
- భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న బాలయ్య బోయపాటి మూవీ
- ఎంట్రీ సీన్ కోసం భారీ సెట్ వేస్తున్న మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhanda 2 Thandavam : టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన చిత్రం ‘అఖండ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 2021లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘అఖండ 2’ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ‘అఖండ 2’ చిత్రానికి నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం చైనీస్ వ్యక్తిని ఎంపిక చేస్తారని భావిస్తున్నారు.
Read Also:Chiru Odela Project : చిరు – ఓదెల ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డే్ట్.. ఇది కదా కావాల్సింది
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
మొదటి సినిమాకు మించి అఖండ 2 సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అఖండ విజయాన్ని మించి అఖండ 2 సాధిస్తుందని యూనిట్ నమ్మకంగా చెబుతోంది. దీంతో ‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారంటూ బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది. బోయపాటి శ్రీను ఇప్పటికే ‘అఖండ 2’కు స్క్రిప్ట్ పూర్తి చేశాడు. ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ పై కసరత్తులు చేస్తున్నారు. కాగా ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది. మరోవైపు లొకేషన్స్ ను కూడా ఇప్పటికే బోయపాటి ఫైనల్ చేశాడు. జనవరి మూడో వారం నుంచి ఆఖండ పాత్రకు సంబంధించిన ఎంట్రీ సన్నివేశాలను తెరకెక్కిస్తారట. ఇందులో భాగంగానే బాలయ్య ఇంట్రో కోసం ప్రత్యేకంగా ఓ సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also:PKL 2024 Final: నేడు ప్రొ కబడ్డీ ఫైనల్ మ్యాచ్.. టైటిల్ పోరులో పాట్నా, హర్యానా..
ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ తో డబుల్ హ్యాట్రిక్ కు బాటలు వేయాలని బోయపాటి ప్రయత్నిస్తున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే బోయపాటి ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!