Ayyanna Patrudu Arrest: మాజీమంత్రి అయ్యన్న అరెస్టులో కొత్త ట్విస్ట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayyanna Patrudu Arrest: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుని అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్ ప్లాజా దగ్గర ఆయన్ని తరలిస్తోన్న వాహనాలను అడ్డుకున్నాయి టీడీపీ శ్రేణులు.. దీంతో.. అయ్యన్నను వదిలి వెళ్లిపోయారు పోలీసులు.. హైవే పక్కన హోటల్ కు అయ్యన్నపాత్రుడు తరలివెళ్లారు.. అయ్యన్నపాత్రుడు అరెస్ట్ పై టీడీపీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. అయ్యన్నను అరెస్ట్ చేసిన పోలీసులపై ప్రయివేట్ కేసు వేస్తామని హెచ్చరిస్తున్నారు.. రాష్ట్రంలో గళం విప్పే బీసీ నాయకుణ్ణి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.. అక్రమ అరెస్టులతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. దొంగల్లా చొరబడి అరెస్టులు చేయడం దారుణం.. 41 నోటీసులు కోసం అరెస్టులు అవసరం ఏంటో అధికారులు చెప్పాలని నిలదీశారు మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, గండి బాబ్జీ.
ఇక, తనను అరెస్ట్ చేసి విడిచిపెట్టిన తర్వాత మీడియాతో మాట్లాడారు మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు.. నన్ను అరెస్ట్ చేసే తీసుకెళ్తున్న సమయంలో మార్గం పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిందన్న ఆయన.. 10 నిముషాల తర్వాత నా దగ్గరకు వచ్చిన పోలీసులు విడిచి పెడుతున్నట్టు చెప్పారని తెలిపారు. 41 (ఎ) నోటీసులు ఇచ్చి 10 రోజుల్లో హనుమాన్ జంక్షన్ వచ్చి హాజరవ్వమన్నారని వెల్లడించారు. అయితే, ఈ నెల 4న పుట్టిన రోజు ఉంది ఆ తర్వాత వస్తానని చెప్పానన్నారు. అయినా.. నేను గన్నవరం సభలో ఎటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు.. జరుగుతున్న విషయాలే చెప్పానన్నారు అయ్యన్నపాత్రుడు.
Also Read
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
కాగా, ఈ నెల 14న విచారణకు రావాలని అయ్యన్నకు పోలీసుల నోటీసులు ఇచ్చారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 41 ఏ కింద నోటీసు ఇచ్చారు. మొదట అరెస్ట్ చేయండి.. ఆ తర్వాత మధ్యలో వదిలేయడం.. 41 A నోటీసులు ఇవ్వడం.. ఇలా అనుమానాస్పదంగా పోలీసుల తీరు ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు.
మరోవైపు.. అయ్యన్న పై కక్ష సాధింపునకే అక్రమ కేసులు అంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అరెస్టు చేస్తారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులే ప్రతిపక్ష నేతలను కిడ్నాప్ చేసే దారుణ పరిస్థితులు దాపురించాయన్న ఆయన.. ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించే అయ్యన్నపై అక్రమ కేసులు, అరెస్టుతో కక్ష సాధిస్తున్నారు. ప్రభుత్వాన్ని తూర్పారబట్టే బీసీ నేత అయ్యన్న పై మొదటి నుంచి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. అయ్యన్న పాత్రుడికి 41 ఏ నోటీసు ఇవ్వడానికే పోలీసులు వచ్చి ఉంటే.. కిడ్నాప్ తరహాలో ఎయిర్ పోర్ట్ నుంచి తీసుకెళ్లాల్సిన, నిర్భందించాల్సిన అవసరం ఏముంది..? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై అయ్యన్న విమర్శలే నేరమైతే.. మంత్రులు, వైసీపీ నేతలు రోజూ చేస్తున్న వ్యాఖ్యలకు, విద్వేష ప్రసంగాలకు జీవితాతం జైల్లో పెట్టాలని వార్నింగ్ ఇచ్చారు. అసమర్థ, మాఫియా పాలకులను విమర్శించక ఏం చేస్తారు..? ధైర్యం ఉంటే తమపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం.. వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి. జగన్ చేస్తున్న తప్పులు, నేరాల్లో ఇలా అక్రమ కేసులు బనాయించడం ద్వారా పోలీసులు భాగస్వాములైతే వాళ్లు తీవ్ర మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు చంద్రబాబు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
-
AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్తో వన్డే, టెస్ట్ సిరీస్ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్లు
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!