Pekamedalu Movie Paid Premiers Only Rs 50: వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా తెరకెక్కిన సినిమా ‘పేకమేడలు’. నీలగిరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను నటుడు రాకేశ్ వర్రే నిర్మించారు. డబ్బు లేకున్నా సంపన్నుడి లైఫ్ స్టైల్ కోరుకునే యువకుడి కథతో ఈ చిత్రం రూపొందింది. పేకమేడలు చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి స్పందన లభించింది. కామెడీతో పాటు మధ్యతరగతి ఫ్యామిలీ ఎమోషన్స్‌ని చాలా బాగా చూపించారు. ఇక సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో పేకమేడలు చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.
తెలుగు ఇండస్ట్రీలో సరికొత్తగా ప్రమోషన్స్‌ను పేకమేడలు చిత్ర యూనిట్ చేస్తోంది. ఇప్పటికే వినూత్న రీతిలో క్యూఆర్ స్కాన్, బంతితో హీరో చేసిన ప్రమోషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఇక ఇప్పుడు అదే తరహాలో ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా పెయిడ్ ప్రీమియర్స్ టికెట్‌ను రూ.50కే అందిస్తోంది. హైదరాబాద్ సహా వైజాగ్, విజయవాడలలోని పలు ప్రదేశాల్లో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. కొత్తగా చేస్తున్న ఈ ప్రమోషన్స్ చూసి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వచ్చి సినిమాని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
Also Read: Darling Pre Release Event: అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు నాని: ప్రియదర్శి
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వ్యవహరించి.. హీరోగా చేసిన సినిమా ‘ఎవరికీ చెప్పొద్దు’. ఈ సినిమా థియేటర్, ఓటీటీలో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండవ సినిమాగా పేకమేడలు రాబోతోంది. ఈ సినిమాతో తొలిసారిగా తెలుగులో హీరోగా వినోద్ కిషన్ పరిచయం అవుతున్నాడు. ఇదివరకు ‘నా పేరు శివ’, ‘అంధగారం’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాల్లో వినోద్ కిషన్ నటించారు. పేకమేడలులో రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ నటించారు.