Hyderabad Police : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 13 కొత్త పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కారు జీవో జారీ చేసింది. దోమలగూడ, లేక్ పోలీసు స్టేషన్, ఖైరతాబాద్, వారాసిగూడ, తాడ్బన్, బండ్లగూడ, ఐఎస్ సదన్, టోలీచౌకి, గుడిమల్కాపూర్, మాసబ్ ట్యాంక్, ఫిల్మ్ నగర్, రహమత్ నగర్, బోరబండలో కొత్త పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఆరు జోన్లలో జోన్‌కు ఒకటి చొప్పున మహిళా పోలీస్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
Read Also: Frog Curry : కప్పకూర తిన్న కుటుంబం.. కక్కుకుని చనిపోయిన బాలిక
మారేడుపల్లి, బోయిన్‌పల్లి, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, అంబర్‌పేట్, నల్లకుంట, నారాయణగూడ, చిలకలగూడ, బహదూర్‌పురా, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, టోలీచౌకి, లంగర్ హౌజ్‌లలో కొత్త ట్రాఫిక్ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే కొత్త పోలీసు స్టేషన్లకు ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందిని నియమించనున్నారు. ప్రస్తుత స్టేషన్ల పరిధిలో జనసాంద్రత బాగా పెరిగి పోయింది. దీంతో ఫిర్యాదులు, కేసుల సంఖ్య సైతం ఎక్కువైపోయాయి. ఈ క్రమంలో పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసులకు అదనపు పనిభారం సహా అనేక ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. వాటిని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పరిధిలో పోలీస్ ఉన్నతాధికారులు కొత్త జోన్లు ఏర్పాటు చేశారు.
Read Also: Massive Fire Break : హాస్పిటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఊపిరాడక అల్లాడిన రోగులు