Covid Vaccine: గుడ్ న్యూస్.. నోటి మాత్రల రూపంలో కరోనా వ్యాక్సిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని నివారించేందుకు శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో ప్రజలు ఇంజక్షన్ల రూపంలో కరోనా వ్యాక్సిన్‌ను తీసుకుంటున్నారు. అయితే తాజాగా ట్యాబ్లెట్ రూపంలో కరోనా వ్యాక్సిన్‌ను సైంటిస్టులు కనుగొన్నారు. దీంతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. కరోనా రోగుల నోటి నుంచి వెలువడే తుంపర్ల సంఖ్యను ఈ సరికొత్త టీకా గణనీయంగా తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టు అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు.
ఈ కరోనా మాత్ర వేసుకుంటే రక్తంలో, ఊపిరితిత్తుల్లోనూ యాంటీబాడీలను సమర్థంగా తయారుచేస్తుందని తమ పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు వివరించారు. అడినోవైరస్‌ను వాహకంగా ఉపయోగించుకునేలా ఈ టీకాను తాము అభివృద్ధి చేసినట్లు తెలిపారు. తద్వారా కరోనా వైరస్ నుంచి ఈ టీకా రక్షణ కల్పిస్తుందని సైంటిస్టులు పేర్కొన్నారు. ఇంజక్షన్ ద్వారా తీసుకునే టీకాతో పోలిస్తే ఈ నోటి టీకా ఇమ్యునోగ్లోబ్యులిన్-ఎను అధికంగా ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. కరోనా రోగులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు వెలువడే తుంపర్ల నుంచి వెలువడే వైరస్ కణాల సంఖ్యను తగ్గించడంలో ఐజీ-ఎ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
Also Read
- China-Bangladesh: చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి ఇంధన రసాయనం? పట్టుకున్న ఇండోనేషియా నేవీ!
- India-Modi: ఆసియా టాప్-3లో భారత్.. అత్యంత సమర్థవంతమైన నేతల్లో రెండో స్థానంలో మోదీ!
- Houthis Attack Saudi Arabia: సౌదీ అరేబియాపై హూతీల దాడి.. చమురు శుద్ధి కర్మాగారమే టార్గెట్..!
- Pakistan minister: ఉగ్రవాదం, సింధు జలాలపై పాక్ మంత్రి దాటవేత!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
PM Modi: నేపాల్‌కు భారీ సాయం.. రూ.15 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ..
-
Bihar MLA Anant Singh: బీహార్ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. 50 లక్షల గులాబ్ జామూన్లు, విజేతకు థార్ కారు!
-
Anil Ravipudi: కమర్షియల్ హిట్ కొట్టడం అనిల్ రావిపూడి వల్లే అవుతుందా? మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు?
-
Tollywood: టాలీవుడ్’కు ఈ ఏడాది బిగ్ షాక్
ట్రెండింగ్
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!