New EV Policy In Telangana: తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ కొత్త విధానం నేటి నుంచి అమల్లోకి రానుంది.
తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ రానుందని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో 41 ద్వారా కొత్త ఈవీ పాలసీ అమలు కానుందని అన్నారు. వాయు కాలుష్యాన్ని నియత్రించేందుకు ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం పేర్కొన్నారు.