తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి నేడు పదవీ విరమణ చేశారు. తెలంగాణ నూతన డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు చేపట్టారు. అంజనీకుమార్‌కు ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి గౌరవ లాఠీని అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డితో పాటుగా పలువురు పోలీసుల ఉన్నతాధికారులు నూతన పోలీసు బాస్ అంజనీకుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మహేందర్ రెడ్డికి సీనియర్ పోలీసు అధికారులు, సిబ్బంది వీడ్కోలు పలికారు. అయితే.. లకడీకాపూల్‌లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో తెలంగాణ నూతన డీజీపీగా శనివారం మధ్యాహ్నం 12.57 నిమిషాలకు అంజనీ కుమార్ ఛార్జ్ తీసుకున్నారు. అయితే.. ఈ సందర్భంగా కొత్త డీజీపీగా నియమితులైన అంజనీ కుమార్ మాట్లాడుతూ.. తనను డీజీపీగా నియమించినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాభద్రతకు తెలంగాణ పెద్ద పీట వేస్తుందని.. దేశ అభివృద్ధికి తెలంగాణ ఇంజన్ లాంటిదని అన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శమని, ప్రతి అధికారి లీడర్‌గా పనిచేయాలన్నారు.
Also Read :Rishabh Pant: రిషబ్ పంత్ ఆరోగ్యంపై క్లారిటీ.. ప్లాస్టిక్ సర్జరీ చేసిన వైద్యులు
క్విక్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రజలకు నిరంతరం రక్షణగా ఉంటాం అని తెలిపారు. పోలీస్ వ్యవస్థలో టెక్నాలజీ తీసుకురావడానికి డీజీపీ మహేందర్ రెడ్డి ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. పోలీస్ వ్యవస్థలో డీజీపీ మహేందర్ రెడ్డి తీసుకువచ్చిన కొత్త సంస్కరణలు అన్ని కొనసాగిస్తా అని తెలిపారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని ప్రగతి భవన్ లో అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీలు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.