Off The Record: రేవంత్ సీఎం నినాదాలపై పార్టీ సీనియర్స్‌లో అసహనం మొదలైందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆలూ లేదు, చూలు లేదు… కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. ఆ పార్టీలో అలాంటి వాతావరణం కొత్త కాకున్నా… ఇప్పుడు సబ్జెక్ట్ ఇంకా స్పెషల్ అట. సీనియర్ నేతల మాటలు, చర్యలు వూహాతీతంగా ఉన్నాయట. ఇంతకీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? మరీ… అంత స్పెషల్ ఏంటి?
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలి ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. క్రమశిక్షణ లేమికి కేరాఫ్ అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. రాష్ట్రంలో పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సీనియర్ నాయకులంతా కలిసి పనిచేయాల్సింది పోయి.. ఎవరికి వారే ఈసారి మేమే సీఎం క్యాండిడేట్ అని ప్రచారం చేసుకుంటున్నారట. తాజాగా జరిగిన మంచిర్యాల సభలో ఇది మరోసారి బయటపడిందట. చూడ్డానికి అందరూ ఒకే వేదిక మీద కూర్చున్నా… ఎవరి గ్రూపులు వారివిగానే ఉన్నాయట. సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కనుద్దేశించి ఆయన మద్దతుదారులు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. దీనికి తోడు భట్టితో పాటు పాదయాత్రలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి… దళిత సీఎం అనే ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. మరో అడుగు ముందుకేసిన కోమటిరెడ్డి భట్టిని వైయస్ రాజశేఖర్ రెడ్డితో పోల్చారు. నడక…నడత అంతా వైయస్ లాంటివేనని ప్రశంసించారు. దీంతో మంచిర్యాల సభ వేదిక దగ్గర భట్టి.. సీఎం నినాదాలు గట్టిగానే వినిపించాయట. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు , భట్టి ఇద్దరు మంచి మిత్రులు. అందులో భాగంగానే…పాదయాత్రను కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభించారనేది టాక్. మాజీ ఎమ్మెల్సీ అనుచరులే భట్టి సీఎం అంటూ సభలో నినాదాలు చేశారట. ప్రేమ్ సాగర్ రావు మాత్రం… వ్యూహాత్మకంగా వేదిక మీదున్న నాయకుల్లో ఒకరు సీఎం అవుతారంటూ ప్రకటించారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
Also Read : Delhi Lieutenant Governor: ఢిల్లీ సీఎంపై చట్టపరమైన చర్యలు.. కేజ్రీవాల్ కు లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ
గతంలో ఎక్కడ సభలు, సమావేశాలు జరిగినా పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి సీఎం.. సీఎం.. అంటూ కార్యకర్తలు నినాదాలు చేసేవారు కార్యకర్తలు. ఇది పార్టీలోని సీనియర్లు కొందరికి అస్సలు నచ్చేదికాదట. అంతర్గత సమావేశాల్లో కూడా దీనిపై చర్చ లేవనెత్తేవారట. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు తన అనుచరులకి వేదిక మీద నుంచే సీఎం నినాదాలు మానుకోవాలని సూచించారు రేవంత్. కానీ అది కొనసాగుతూ నే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. అందుకే అంతా కలిసి పనిచేయాల్సిన సందర్భం ఇది.
ఉమ్మడి రాష్ట్రంలో రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య బిజెపి వచ్చి చేరింది. బిజెపికి ఉన్న బలం ఎంత అనేదాని కంటే ఆ పార్టీ వేస్తున్న ఎత్తుగడలు..కాంగ్రెస్‌కి రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తున్నాయట. దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించకుండా… అందుకు ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకోకుండా… బహిరంగ వేదికల మీద ఈ సీఎం నినాదాలు ఏంటని పార్టీలోని మరో వర్గం అసహనంగా ఉందట. రాజకీయాల్లో పదవులు ఆశించడం సహజమే అయినా… అసలేమీ లేకుండా… అధికారంలోకి వచ్చే ఉమ్మడి ప్రయత్నాలు చేయకుండా…ఆలులేదు, చూలులేదన్న సామెతను గుర్తు చేస్తూ… ఈ గొడవలేంటని అంటున్నారట మరి కొందరు నాయకులు.
ఏదేమైనా… కాంగ్రెస్ కల్చర్‌లో మాత్రం ఇలాంటివన్నీ సహజమేనన్న వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి. వాళ్ళంతే… అలా కొట్లాడుకుని అవతలి వాళ్ళకు చేజేతులారా అవకాశం ఇస్తారన్నది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. ఇన్నాళ్ళు రేవంత్ సీఎం అని నినాదాలు వినిపిస్తే… ఇప్పుడు కొత్తగా ఆ లిస్ట్‌లో భట్టి విక్రమార్క వచ్చి చేరారు. జరుగుతున్న పరిణామాలపై పీసీసీ మాజీ ఛీఫ్ ఒకరు తీవ్ర అసహనంతో ఉన్నారట. చూడాలి… సీఎం వార్ టి కాంగ్రెస్‌ని ఎటు తీసుకువెళ్తుందో.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!