Amazon Prime Day Sale 2024: ప్రైమ్ డే సేల్‌లో అమ్మకానికి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదే!
- అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024
- అమ్మకానికి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
- భారీగా డిస్కౌంట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New 5G Smartphones Sale in Amazon Prime Day Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ప్రైమ్ డే సేల్ 2024 తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా తీసుకొస్తున్న ఈ సేల్.. జులై 20, 21 తేదీల్లో కొససాగనుంది. ఈ సేల్‌లో 450 కంటే ఎక్కువ బ్రాండ్‌ల ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి. మొబైల్, ల్యాప్‌టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పాటు ఇతర ప్రొడక్టులపైనా భారీగా డిస్కౌంట్లు లభించనున్నాయి. అలానే ఈ సేల్ సమయంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయని కూడా అమెజాన్ పేర్కొంది.
శాంసంగ్, ఐకూ, హానర్, లావా, మోటోరోలా, వన్‌ప్లస్ నుంచి లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లు అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024లో అమ్మకాన్ని ఉండనున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం35, ఐకూ జెడ్9 లైట్ 5జీ ఫోన్‌లు జూలై 17న భారతదేశంలో లాంచ్ కానున్నాయి. ఇవి అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో విక్రయించబడతాయి. హానర్ 200, హానర్ 200 ప్రో ఫోన్‌లు కూడా జూలై 18న భారత్‌లో లాంచ్ కానున్నాయి. ప్రైమ్ డే సేల్‌లో ఇవి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.
Also Read
Also Read: Moto G85 5G Price: భారత మార్కెట్‌లోకి ‘మోటో జీ85’ ఫోన్.. ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువ!
లావా బ్లేజ్ ఎక్స్ జూలై 10న భారత్‌లో విడుదల కానుంది. ఈ ఫోన్ ప్రైమ్ డే సేల్ 2024 సమయంలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో లాంచ్ అయిన మోటోరోలా రేజర్ 50 అల్ట్రాకూడా అమ్మకాన్ని వస్తోంది. ఈ సేల్‌లో పెద్ద ఎత్తున డిస్కౌంట్ కూడా పొందొచ్చు. 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.99,999గా ఉండగా.. సేల్ సమయంలో రూ.10వేలు తగ్గింపు లభించనుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ అల్ట్రా ఆరెంజ్ కలర్ వేరియంట్‌లో అమ్మకానికి రానుంది. వన్‌ప్లస్ 12ఆర్, రెడ్‌మీ 13, రియల్‌మీ జీటీ 6టీ కొత్త కలర్ వేరియంట్‌లో అమ్మకానికి ఉంటాయి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!