Moto G85 5G Launch Date and Price in India: చైనా టెక్ దిగ్గజం లెనోవో అనుబంధ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ ఇటీవల వరుసగా మార్కెట్‌లో 5జీ ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. మోటోరొలా ఎడ్జ్ 40, మోటోరొలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్‌లతో మునపటి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రేజ్‌ను కాపాడుకునేందుకు మరో సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు మోటోరొలా సిద్దమైది. ‘మోటో జీ85’ 5జీ ఫోన్‌ను జులై 10న భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించనుంది. ఈ ఫోన్‌ను కంపెనీ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉండేలా తీసుకొస్తుంది.
గత కొన్ని రోజుల క్రితం చైనాలో ఈ ఫోన్‌ను ‘ఎస్50 నియో’ పేరుతో రిలీజ్ చేశారు. భారత్‌లో మాత్రం ‘మోటో జీ85 పేరుతో తీసుకొస్తుంది. అధికార వెబ్ సైట్, ఫ్లిప్‌కార్ట్, సెలెక్టెడ్ రిటైల్ స్టోర్‌లలో మోటో జీ85 5జీ ఫోన్ అందుబాటులో ఉంటుందని మోటరోలా తెలిపింది. ఈ ఫోన్ ధర ఎంత అన్నది కంపెనీ అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. అయితే తెలిసిన సమాచారం ప్రకారం.. రూ.18 వేల నుంచి రూ.20 వేల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఫోన్‌కు సంంధించిన పూర్తి వివరాలపై జుల్ 10న తెలియరానుంది.
Also Read: Abhishek Sharma Bat: సెంచరీ చేసిన బ్యాట్ నాది కాదు.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
మోటో జీ85 లో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉండనుంది. 400X1080 పిక్సెల్ రెజుల్యూషన్‌తో కూడిన పీఓఎల్‌ఈడీ ప్యానెల్,120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నారు. 50 మెగాపిక్సెల్స్ ప్రధాన కెమెరా, 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఈ ఫోన్‌ను 12జీబీ+512జీబీ స్టోరేజ్‌తో తీసుకొస్తున్నారు.