Netizens Asks, Why Shardul Thakur picked over R Ashwin: శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌కు శ్రేయాస్ అయ్యర్ క్లాస్ తోడవ్వడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించిన భారత్.. పాక్‌ను ఏ దశలో కోలుకోనివ్వలేదు. అయితే ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ విఫలమయ్యాడు.
ఈ మ్యాచ్‌లో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడతాడని అంతా అనుకున్నారు. సునీల్ గవాస్కర్ లాంటి సీనియర్లు కూడా అశ్విన్‌నే జట్టులోకి తీసుకోవాలని సూచనలు చేశారు. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం స్పిన్నర్ కంటే.. ఆల్‌రౌండర్ జట్టులో ఉండాలని భావించింది. దాంతో అశ్విన్‌ను పక్కన పెట్టి శార్దూల్ ఠాకూర్‌ని తుది జట్టులోకి తీసుకుంది. మ్యాచ్‌లో మిగతా భారత బౌలర్లు అందరూ రెండేసి వికెట్స్ పడగొట్టి తక్కువ రన్స్ ఇస్తే.. శార్దూల్ మాత్రం భారీగా పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు.
మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన శార్దూల్ ఠాకూర్.. 12 పరుగులిచ్చి ఫెయిల్ అయ్యాడు. ఇక బ్యాటింగ్‌లో అతడికి క్రీజులోకి వచ్చే అవకాశమే రాలేదు. దాంతో నెటిజన్స్ ఠాకూర్‌ని ట్రోల్ చేస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ‘శార్దూల్ మ్యాచ్ ఆడాడనికి వచ్చాడా?.. లేదంటే చూడడానికి వచ్చాడా?. అక్షర్ పటేల్ ఉంటే బాగుండేది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘శార్దూల్ జట్టులో ఎందుకు?.. యావరేజ్ ప్లేయర్’ అని ఇంకో నెటిజన్ ట్వీట్ చేశాడు. ఠాకూర్‌ని ట్రోల్ చేస్తూ చాలామంది నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
What is the point in playing Shardul Thakur…?
He hardly bowled 2 overs
He is an average bowler… Average batsman
Ashwin should be picked in his place or maybe SKY
— Amit yadav (@AMITYAD34372576) October 14, 2023
What’s for shardul thakur in team?
If he is a bowler then why he hasn’t bowled in this match?
If he is a batsman then why he doesn’t play in middle order?
Is he in team just to make surya Kumar Yadav and Mohd shami sit outside?
Feeling sad for SKY and Shami.#INDvsPAK
— Dr Nimo Yadav (@niiravmodi) October 14, 2023
Bhai Shardul Thakur match khel raha tha na match dekh raha tha ?? Kash Axar Patel hota
— Bibhu D Tripathy(bultu)🇮🇳 (@bultucustoms) October 14, 2023
Despite poor batting by Pakistan middle and lower order it was a mistake to play Shardul Thakur
— رضوی صاحب| Rizvi Sahab (@RealRizvi) October 14, 2023